Salman Khan: డెంగ్యూ బారిన పడ్డ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌.. సినిమా షూటింగులు, బిగ్‌బాస్‌కు బ్రేక్‌

సల్మాన్‌ ప్రస్తుతం కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో టైగర్‌ 3 లోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్‌లకు ఆయన బ్రేక్‌ ఇచ్చినట్లు సమాచారం. అలాగే మరికొన్ని వారాల పాటు బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్ కనిపించరు.

Salman Khan: డెంగ్యూ బారిన పడ్డ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌.. సినిమా షూటింగులు, బిగ్‌బాస్‌కు బ్రేక్‌
Salmankhan
Follow us
Basha Shek

|

Updated on: Oct 22, 2022 | 1:31 PM

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ డెంగ్యూ బారిన పడ్డాడు. ప్రస్తుతం అతను ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం అతను సినిమా షూటింగ్‌లను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌ 16 హోస్టింగ్‌కు కూడా కొంత విరామం ప్రకటించారు. మరోవైపు సల్మాన్‌ ఖాన్‌ అనారోగ్యానికి గురయ్యాడని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కండలవీరుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. కాగా సల్మాన్‌ ప్రస్తుతం కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో టైగర్‌ 3 లోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్‌లకు సల్మాన్‌ బ్రేక్‌ ఇచ్చినట్లు సమాచారం. అలాగే మరికొన్ని వారాల పాటు బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్ కనిపించరు. దీంతో బిగ్ బాస్ షోకు కొత్త హోస్ట్‌ను తీసుకువచ్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్‌ స్థానంలో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తారని వస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి సల్మానే స్వయంగా కరణ్‌ను ఒప్పించినట్లు తెలుస్తోంది. గతంలో కరణ్ బిగ్ బాస్ ఓటీటీకి హోస్ట్‌గా వ్యవహరించాడు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్ సినిమాలో తళుక్కు మెరిశాడు సల్మాన్‌. స్ర్కీన్‌పై కనిపించేది కొద్ది సేపే అయినా తనదైన యాక్టింగ్‌ డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌తో అందరినీ కట్టిపడేశారు. ఫైట్స్‌లో, డ్యాన్సల్లో ఇరగదీశాడు. ముఖ్యంగా థార్‌ మార్‌ థక్కర్‌ మార్‌ పాటలో మెగాస్టార్‌తో సల్మాన్‌ వేసిన స్టెప్పులు అభిమానులను బాగా అలరించాయి. ఇక సల్మాన్‌ కిసి కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో విక్టరీ వెంకటేశ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఫర్హాద్ సమ్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2023 రంజాన్‌ పండగ సందర్భంగా విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం