అందుకే బాలీవుడ్ ఇండస్ట్రీకి బ్యాడ్ టైమ్.. మూవీ క్రిటిక్స్ చెబుతున్న అసలు కారణం ఏంటంటే..?
బాలీవుడ్ ఇండస్ట్రీకి బ్యాడ్ టైమ్ కొనసాగుతోంది. దీనికి కారణం ఏంటి? సినీ విమర్శకులు ఏమని చెబుతున్నారంటే..
ఈ మధ్య బాలీవుడ్ టైమ్ అస్సలు బాలేదు. ఒకటి రెండు బిగ్ హిట్స్ తప్ప బాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ సినిమాలు ఒక్కటి కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఈ విషయంలో మేకర్స్ తప్పే ఎక్కువగా ఉందన్నది సినీ విశ్లేకుల మాట. మూస ఫార్ములాలతో హిట్ అయ్యే ఛాన్స్ కంటెంట్‌ను కూడా వేస్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. గత దశాబ్ద కాలంగా బాలీవుడ్‌లో కామెడీ జానర్ సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యాక్షన్, డ్రామా, రొమాన్స్… కథా కథనాలు ఏ జానర్ అయినా… అందులో కామెడీ మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే. స్టార్టింగ్‌లో బాగానే వర్క్ అవుట్ అయిన కామెడీ ట్రెండ్… రాను రాను ఆడియన్స్‌కు బోర్ కొట్టేసింది. ఆఖరికి సూర్యవంశీ లాంటి యాక్షన్ మూవీ కూడా అనవసరమైన కామెడీ వల్లే ఫెయిల్ అయ్యిందని క్రిటిక్స్ విమర్శిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ రీసెంట్ మూవీ రాధే ఫెయిల్యూర్‌కి కూడా కామెడీనే కారణమన్న టాక్ వినిపిస్తోంది. ట్రైలర్, టీజర్‌లో సినిమా సీరియస్ యాక్షన్ డ్రామా అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి… థియేటర్లో మాత్రం నవ్వించే ప్రయత్నం చేయటంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఈ సినిమాను రిజెక్ట్ చేశారన్నది ఓ ఎనాలసిస్.
యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా కామెడీ కారణంగానే ఫెయిల్ అయ్యారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన హీరోపంతి 2 బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడింది. ఈ సినిమా ఫెయిల్యూర్‌కి కూడా కామెడీనే కారణం అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్‌లో నవాజుద్దీన్ చేసిన కామెడీ సినిమాకు ప్లస్ కాకపోగా… నష్టం కలిగించిందన్నది ఫైనల్ కంక్లూజన్.
కామెడీ కారణంగా వరుస ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నా బాలీవుడ్ మాత్రం ఆ జానర్‌ను వదిలిపెట్టడం లేదు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాల్లోనూ కామెడీ పాళ్లు కాస్త ఎక్కుగానే కనిపిస్తున్నాయి. హారర్ జానర్‌లో తెరకెక్కుతున్న కత్రినా… ఫోన్ బూత్ కూడా కామెడీ మూవీనే అని ట్రైలర్‌లోనే హింట్ ఇచ్చారు మేకర్స్.
రీసెంట్‌గా రిలీజ్ అయిన బేడియా ట్రైలర్‌లోనూ కామెడీనే మెయిన్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తోంది. సీరియస్ థ్రిల్లర్‌గా తెరకెక్కించే ఛాన్స్ ఉన్నా… నార్త్ మేకర్స్ మాత్రం బేడియాను కూడా కామెడీ థ్రిల్లర్‌గానే ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలతో అయినా బాలీవుడ్‌లో కామెడీ వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్..