Shruti Haasan : బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రుతి హాసన్.. అంతర్జాతీయ చిత్రంలో ఛాన్స్ అందుకున్న హీరోయిన్..

శ్రుతి హాసన్ తాజాగా క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఇంటర్నేషనల్ మూవీలో కనిపించనుంది.

Shruti Haasan : బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రుతి హాసన్.. అంతర్జాతీయ చిత్రంలో ఛాన్స్ అందుకున్న హీరోయిన్..
Srutihaasan
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 22, 2022 | 3:33 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది శ్రుతిహాసన్. రీఎంట్రీ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్‏గా మారనుంది.. ఇదే కాకుండా.. మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతున్న మెగా 154 సినిమాలో.. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీరసింహరెడ్డి మూవీలో నటిస్తోంది. ఇటు తెలుగులోనే కాకుండా బాలీవుడ్‏లోనూ సత్తా చాటుతున్న శ్రుతి.. తాజాగా క్రేజీ ఛాన్స్ కొట్టేసింది.

డైరెక్టర్ డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో రాబోతున్న అంతర్జాతీయ సినిమా ది ఐ చిత్రంలో శ్రుతి కీలకపాత్ర పోషించనున్నారు. ఫింగర్‌ప్రింట్ కంటెంట్ నుండి వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో శ్రుతికి జోడిగా ది లాస్ట్ కింగ్‌డమ్ ఫేమ్ నటుడు మార్క్ రౌలీ కనిపించనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ న్యూస్ వెబ్ సైట్ డెడ్ లైన్ ప్రకటించింది. ఈ వార్తను శ్రుతి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది.

ది ఐ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కథలు చెప్పడం.. ఈ ప్రపంచంలో నాకు అన్నింటికంటే బాగా ఇష్టమైన విషయం. ఇప్పుడు అందులో భాగం అయ్యాను అని రాసింది. ఓ దీవిలో మరణించిన తన భర్త అస్తికల కోసం తిరిగి అక్కడకు వెళ్లిన ఓ యువ వితంతువు నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాగా రాబోతుంది. ఇందులో హాలీవుడ్ నటీనటులు.. అన్నా సవ్వా, లిండా మార్లో, క్రిస్టోస్ స్టెర్గియోగ్లో కూడా నటించనున్నారు. ఈ నెలాఖరులో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.