AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthikeya 2: ‘కార్తికేయ 2 అందుకే హిట్ అయ్యింది’.. హీరో.. డైరెక్టర్ పై పరుచూరి గోపాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Karthikeya 2: 'కార్తికేయ 2 అందుకే హిట్ అయ్యింది'.. హీరో.. డైరెక్టర్ పై పరుచూరి గోపాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Karthikeya 2, Paruchuri
Rajitha Chanti
|

Updated on: Oct 22, 2022 | 3:32 PM

Share

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్..ఇటీవల కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఉత్తరాదిలోనూ ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించగా.. డైరెక్టర్ చందూ మోండేటీ దర్శకత్వం వహించారు. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న కార్తికేయ 2 సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి పాఠాల ద్వారా తనదైన శైలీలో విశ్లేషణ చేశారు. ఈ కథ బాడీలాంగ్వేజీ నిఖిల్ కు సంబంధించింది కాదని.. ఈ సినిమాను అతను చాలా కష్టపడ్డాడు.. అందుకే విజయం సాధించింది అంటూ చెప్పుకొచ్చారు.

కష్టేఫలి అనే సూత్రం నిఖిల్ విషయంలో మరోసారి రుజువైంది. కార్తికేయ 2 సినిమా3 బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ లాభాలు రాబట్టింది. డైరెక్టర్ చందూ మోండేటి ఈ చిత్రాన్ని పాతాళభైరవి లాంటి జానపద కథను సాంఘిక కథగా మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సినిమాలోని హంస, మురళి, కృష్ణుడి విగ్రహం అన్ని పురాణ సంబంధమైన జానపద కథను తలపిస్తున్నాయి. ఈ సినిమాను చందు మొండేటి అద్భుతంగా చిత్రీకరించారు. తాను రాసుకున్న కథను దర్శకుడు నమ్మి వివిధ దేశాలకు తిరిగి ఎంతో కష్టపడ్డారు. అలా కథను నమ్మినవారిని కథ ఎప్పుడూ మోసం చేయదు.

కృష్ణతత్వాన్ని కలియుగానికి అన్వయిస్తూ చూపించారు. సామాన్యంగా ఇలాంటి కథల్లో ప్రేమ సన్నివేశాలు ఉండవు.. కానీ డైరెక్టర్ చాలా జాగ్రత్తగా ప్రతి సన్నివేశంలోనూ హీరోహీరోయిన్స్ ఉండేలా చూసుకున్నారు. క్లైమాక్ లో పాములను ఎంతో తెలివిగా ఉపయోగించుకున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్లై రాశారు డైరెక్టర్. అలాగే ఎక్కడ నవ్వించాలో.. ఎవరితో కామెడీ చేయించాలో వారితోనే చక్కగా హాస్యాన్ని పండించారు అంటూ హీరో.. దర్శకుడితోపాటు..చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు. హీరో.. డైరెక్టర్ ఇద్దరికీ హ్యాట్సాఫ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. నటీనటులందరూ వారి వారి పాత్రల్లో సరిగ్గా సరిపోయారు. ఈ సినిమాను చూడనివారు ఎవరైన ఉంటే తప్పకుండా చూడాలని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.