Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. అప్డేట్ వచ్చేస్తుందని చెప్పేసిన డైరెక్టర్.. ఇంతకీ ఏ సినిమా అంటే ?..

డార్లింగ్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. రేపు ప్రభాస్ సినిమా నుంచి అప్డేట్ వస్తుందని నెటిజన్ ట్వీట్‏కు ఓ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ఇంతకీ ఏ సినిమా అనే కదా.. మీ సందేహం. దీపావళి కానుకుగా అభిమానులకు ముందుకు రాబోతున్న ఆ అప్డేట్ గురించి తెలుసుకోవాల్సిందే.

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. అప్డేట్ వచ్చేస్తుందని చెప్పేసిన డైరెక్టర్.. ఇంతకీ ఏ సినిమా అంటే ?..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 22, 2022 | 3:37 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే రాధేశ్యామ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డార్లింగ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ అభిమానులు.. రాబోయే సినిమాలపైనే అంచనాలు పెట్టుకున్నారు. తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ దర్శకులతోనూ ప్రభాస్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం. భారీ బడ్జెట్‏తో ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రాల్లో ప్రాజెక్ట్ కె కూడా ఒకటి. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్వీన్ రూపొందిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, బిగ్ బి అమితాబ్ కీలకపాత్రలో నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీనుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ చాలా రోజులుగా డైరెక్టర్.. చిత్రబృందాన్ని అప్డేట్ ఇవ్వాలంటూ నెట్టింట వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే డార్లింగ్ బర్త్ డే రోజైన అప్డేట్ ఇవ్వాలని అడిగిన నెటిజన్ కు రిప్లై ఇచ్చాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్..

ప్రభాస్ పుట్టినరోజు వస్తుండడంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సందడి మొదలైంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. నాగ్ అశ్విన్ ను ట్యాగ్ చేస్తూ హాయ్ అన్న గుర్తు ఉన్నామా మేము అసలు అని అడగ్గా.. ఊహించని చిన్న ట్రీట్ రేపు వస్తుందంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ప్రాజెక్ట్ కె నుంచి ఎలాంటి అప్డేట్ రాబోతుందనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా.. హోంబలే ఫిల్మ్ నిర్మిస్తోంది. మరోవైపు బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ షూటింగ్ కంప్లీ్ట్ చేశాడు ప్రభాస్. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవే కాకుండా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ మూవీ చేయనున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.