AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Laundering Case: మనీలాండరింగ్‌ కేసులో నటి జాక్వెలిన్‌కు ఊరట .. బెయిల్ పొడిగించిన ఢిల్లీ కోర్టు..

బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ బెయిల్‌ను నవంబర్‌ 10వ తేదీ వరకు పొడిగించింది ఢిల్లీ కోర్టు. మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ పాటియాలా హౌస్‌ కోర్టు ముందు..

Money Laundering Case: మనీలాండరింగ్‌ కేసులో నటి జాక్వెలిన్‌కు ఊరట .. బెయిల్ పొడిగించిన ఢిల్లీ కోర్టు..
Jacqueline Fernandez
Shiva Prajapati
|

Updated on: Oct 22, 2022 | 3:43 PM

Share

బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ బెయిల్‌ను నవంబర్‌ 10వ తేదీ వరకు పొడిగించింది ఢిల్లీ కోర్టు. మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ పాటియాలా హౌస్‌ కోర్టు ముందు హాజరయ్యారు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌. ఢిల్లీలో కోర్టులో జాక్వెలిన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. మాయగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ 200 కోట్ల మోసం కేసులో జాక్వెలిన్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. సుఖేశ్‌ చంద్రశేఖర్‌ నుంచి జాక్వెలిన్‌కు కోట్ల విలువైన బహుమతులు అందాయని గత ఆగస్ట్‌లో ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది.

మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌కు కోర్టు తాత్కాలిక బెయిల్‌ ఇచ్చింది. సుఖేశ్‌ చంద్రశేఖర్‌తో సంబంధాలపై జాక్వెలిన్‌ను ఈడీ పలుమార్లు విచారించింది. అయితే ఈ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు జాక్వెలిన్‌. సినిమాల్లో కష్టపడి నటించి సంపాదించినట్టు తెలిపారు.

అ2యితే, రూ.200 కోట్ల అక్రమ వసూళ్ల కేసుల్లో ప్రధాన సూత్రధారి, నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్.. ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్నాడు. అతనిపై మనీలాండరింగ్ సహా పలు కేసులు నమోదు చేశారు.

మరిన్ని ఎంటర్‌టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..