AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Birthday: అక్కడ డార్లింగ్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి.. ప్రభాస్‌ కోసం ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?

వరల్డ్‌ వైడ్ ఫ్యాన్‌ బేస్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్‌ పుట్టినరోజు నేడు (అక్టోబర్‌22). అభిమానులు ముద్దుగా డార్లింగ్‌ అని పిలుచుకునే ఈ హీరోకు ఎంత క్రేజ్‌ ఉందో ఒకసారి తెలుసుకుందాం రండి.

Prabhas Birthday: అక్కడ డార్లింగ్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి.. ప్రభాస్‌ కోసం ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
Prabhas Birthday
Basha Shek
|

Updated on: Oct 23, 2022 | 8:54 AM

Share

ప్రభాస్‌.. పాన్‌ ఇండియా స్టార్‌ అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న స్టార్‌ హీరో. బాహుబలి సిరీస్‌ సినిమాలతో విదేశాల్లోనూ ఆయన పాపులారిటీ పెరిగిపోయింది. అందుకే ఆయన చేసే సినిమాలన్నీ విదేశాల్లో కూడా విడుదలవుతున్నాయి. డైరెక్టర్లు కూడా పాన్‌ వరల్డ్‌ను దృష్టిలో ఉంచుకునే కథలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభాస్‌ నటిస్తోన్న ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్‌-కే, స్పిరిట్‌ సినిమా కథలన్నీ పాన్‌ ఇండియా సినిమాలే. ఈ సినిమాలు ఎప్పుడెప్పుడూ థియేటర్లలోకి వస్తాయా? డార్లింగ్‌ను ఎప్పుడు చూద్దామా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా వరల్డ్‌ వైడ్ ఫ్యాన్‌ బేస్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్‌ పుట్టినరోజు నేడు (అక్టోబర్‌22). అభిమానులు ముద్దుగా డార్లింగ్‌ అని పిలుచుకునే ఈ హీరోకు ఎంత క్రేజ్‌ ఉందో ఒకసారి తెలుసుకుందాం రండి. బాహుబలి సినిమాతోనే పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్‌. ఈచిత్రంతోనే అతని క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పటికీ కొన్ని హోటల్స్‌ తమ ప్రమోషన్స్‌కి బాహుబలి పేరునే వాడుకుంటున్నాయి. బాహుబలి థాలీ, పరాఠా, కట్టప్ప బిర్యానీ, భల్లాలదేవ పాటియాలా లస్సీ, శివగామి షాహి పక్వాన్ వంటి స్పెషల్‌ వంటకాలను మెనూలో చేర్చుతూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికీ బాహుబలి థాలీకి ఎంతో డిమాండ్‌ ఉంది.

బాహుబలి బొమ్మలు.. పచ్చబొట్టు..

ఇప్పటికీ కొన్ని టాయ్స్‌ కంపెనీలు బాహుబలి బొమ్మలను తయారుచేసి తమ వ్యాపారాన్ని మూడుపువ్వులు ఆరు కాయలుగా మల్చుకున్నాయి. ఇక జపాన్‌లో యంగ్ రెబల్‌ స్టార్‌కు బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీరిని ఆకట్టుకునేందుకు అక్కడ ఉండే ఓ హోటల్‌ ఓ స్పైసీ డిష్‌ ప్యాకేజింగ్‌కు ప్రభాస్‌ ఫోటోను అతికించి తమ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్‌ చేసుకుంటోంది. ఓసారి జపాన్‌ లేడీ ఫ్యాన్స్‌ అంతా కేవలం ప్రభాస్‌ను కలవడానికే మనదేశం వచ్చారు. అతని ఇంటి ముందు కూడా కొన్ని ఫొటోలను దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇక ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఓ ఫ్యాన్‌ ఏకంగా తన వీపుపై బాహుబలి ట్యాటూను వేయించుకున్నాడు. ఇది అప్పట్లో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇక ఆరడుగుల అందగాడైన ఈ హీరోకు లేడీస్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. కొందరు హీరోయిన్లతో పాటు అమ్మాయిలు కూడా ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ ఓపెన్‌గా స్టేట్‌మెంట్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. ఇదే క్రమంలో రష్యన్‌కు చెందిన ఓ లేడీ ఫ్యాన్‌ ‘లవ్‌ ప్రభాస్‌’ అంటూ తన వీపుపై పచ్చబొట్టు వేయించుకోవడం విశేషం.

ఇవి కూడా చదవండి

Prabhas Birthday 1

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్‌ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో సలార్‌, నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ప్రాజెక్ట్‌ కే చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటితో పాటు సందీప్‌ రెడ్డి వంగా, మారుతి దర్శకత్వంలోనూ ప్రభాస్‌ సినిమాలు చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..