Director Anudeep KV : ఆ యంగ్ హీరోకి కథ చెప్పాలి.. ప్రిన్స్ దర్శకుడు అనుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తో సినిమా చేశారు అనుదీప్. తెలుగు, తమిళ్ భాషలలో తెరకెక్కిన కంప్లీట్ ఎంటర్‌టైనర్ 'ప్రిన్స్'. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటించింది.

తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న దర్శకుల్లో అనుదీప్ ఒకరు. జాతిరత్నాలు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు అనుదీప్. నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్‌తో సినిమా చేశారు అనుదీప్. తెలుగు, తమిళ్ భాషలలో తెరకెక్కిన కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘ప్రిన్స్’. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటించింది. సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం హిలేరియస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో దర్శకుడు అనుదీప్ కెవి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ప్రిన్స్ సినిమాకు అన్ని చోట్ల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. తమిళ్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండో రోజు నుండి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పెరుగుతున్నారు. తెలుగులో మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఒక కోస్టల్ ఏరియాలో జరిగే కథ ఇది. దాని తగిన వాతావరణం క్రియేట్ చేశాం. తెలుగు వెర్షన్ మేము ఊహించినదాని కంటే గొప్ప ఆదరణ లభించింది. తెలుగు నటీనటులని తీసుకొని బైలింగ్వల్ గా చేయాలని అనుకున్నాం అయితే చాలా మార్పులు వస్తాయి. సమయం పడుతుంది. అలాగే పెద్ద హీరోల సినిమాకి రిలీజ్ సమయం ఒక సవాల్ గా వుంటుంది.
ప్రస్తుత పరిస్థితులలో దేశభక్తి కంటే మానవత్వం గొప్పదనే ఆలోచననే ప్రిన్స్ కథకు స్ఫూర్తి. దీనిని వినోదాత్మకంగా చెప్పాలని అనుకున్నాం.ఇందులో వార్ సీన్ అన్ రియల్ ఇంజన్- వర్చువల్ రియాలిటీలో అనే కొత్త టెక్నాలజీలో చేశాం. ఇక జెస్సికా మాత్ర కోసం చాలా వెదికాం. మారియ చాలా బాగా ఆడిషన్స్ ఇచ్చింది. ఆడిషన్స్ తర్వాత జెస్సికా పాత్రకు మరియా పర్ఫెక్ట్ అనిపించింది. భాష విషయంలో కొంచెం ఇబ్బంది వుండేది. సీన్ పేపర్ ని రెండు రోజులు ముందుగానే ఇచ్చేవాళ్ళం అని తెలిపారు. ఇక చేయబోతున్న సినిమాల గురించి మాట్లాడుతూ.. కథలు వున్నాయి. పదిహేను రోజుల్లో చెబుతాను. హిందీలో కూడా ఒక సినిమా చేయాలని వుంది. హీరో రామ్ గారికి ఒక కథ చెప్పాలి అని తెలిపారు అనుదీప్.








