Bigg Boss 6 Telugu: బిగ్‎బాస్ ఏడో వారం ఎలిమినేషన్.. చివరి నిమిషంలో ఆమె సేఫ్.. పప్పుకు శుభంకార్డ్ పలికిన బిగ్‎బాస్ ?..

మొదటి నుంచి బిగ్‎బాస్ ఎలిమినేట్ ఎవరు అనే విషయం నెట్టింట లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎలిమినేషన్ ముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇక ఇప్పుడు కూడా ఏడోవారం ఇంటి నుంచి బయటకు వచ్చే ఇంటిసభ్యుడి పేరు లీకైంది.

Bigg Boss 6 Telugu: బిగ్‎బాస్ ఏడో వారం ఎలిమినేషన్.. చివరి నిమిషంలో ఆమె సేఫ్.. పప్పుకు శుభంకార్డ్ పలికిన బిగ్‎బాస్ ?..
Bigg Boss 6
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 22, 2022 | 7:33 PM

బిగ్‎బాస్ ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. ఇది గత సీజన్లకు ఉన్న మాట. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు. బిగ్‎బాస్ సీజన్ 6 ప్రారంభమై ఏడు వారాలు ముగుస్తున్న కంటెస్టెంట్స్ ఆట తీరు..ప్రవర్తనలు మాత్రం ప్రేక్షకులకు రుచించడం లేదు. మొదటి రోజు నుంచి షో చప్పగా సాగుతుందనడంలో సందేహం లేదు. ప్రతి వారం హోస్ట్ నాగార్జున వచ్చి ఎంటర్టైన్ చేయండి అంటూ చివాట్లు పెడుతున్నా..కంటెస్టెంట్స్ ఆట తీరులో మాత్రం మార్పు రాలేదు. దీంతో ఏకంగా బిగ్‎బాస్ రంగంలోకి దిగి వార్నింగ్ ఇచ్చే స్థాయికి తమ ఆట తీరును తీసుకువచ్చారు. ఇంట్రెస్ట్ లేకపోతే బయటకు వెళ్లిపోండి అంటూ గేట్లు కూడా తెరిచేశారు. దీంతో క్షమించండి అంటూ వేడుకున్నారు ఇంటి సభ్యులు. ఇక ఆ తర్వాత బిగ్‎బాస్ ఇచ్చిన టాస్కులను కంప్లీట్ చేసేందుకు తెగ అవస్థలు పడ్డారు హౌస్మేట్స్. ఇక ఇప్పుడు బిగ్‎బాస్ ఏడో వారం ఎలిమినేషన్ సమయం ఆసన్నమైంది. ఇప్పటివరకు షానీ, అభినయ, చంటి, ఆరోహి, నేహ ఇంటి నుంచి బయటకు రాగా.. ఇక ఇప్పుడు మరో ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు.

అయితే మొదటి నుంచి బిగ్‎బాస్ ఎలిమినేట్ ఎవరు అనే విషయం నెట్టింట లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎలిమినేషన్ ముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇక ఇప్పుడు కూడా ఏడోవారం ఇంటి నుంచి బయటకు వచ్చే ఇంటిసభ్యుడి పేరు లీకైంది. ఈవారం అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం. ఈ వారం ఆదిరెడ్డి, ఆదిత్య, అర్జున్ కళ్యాణ్, ఫైమా, ఇనయ, కీర్తి, మెరీనా, రాజ్, రేవంత్, రోహిత్, శ్రీహాన్, శ్రీసత్య, వాసంతి నామినేట్ కాగా.. ముందునుంచి మెరీనా ఎలిమినేట్ కాబోతుందనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ చివరి నిమిషంలో అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మొదటి రోజు నుంచి అర్జున్ కళ్యాణ్ గేమ్ చూసుకుంటే నిల్. కేవలం శ్రీసత్య వెనక తిరగడం.. ఆమె కోసమే గేమ్ ఆడడం చేస్తూ ప్రేక్షకులకు విసుగు పుట్టించాడు. అయితే శ్రీసత్య మాత్రం అర్జున్‏ను హద్దుల్లో పెడుతూ.. దూరంగా ఉంటూ వస్తోంది. కానీ అర్జున్ అయితే తను బిగ్‎బాస్ హౌస్ లో ఉన్నాడని.. టాస్క్ ఆడాలి.. గెలవాలి అనే విషయాలు పూర్తిగా మర్చిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రేక్షకులేకాదు.. బిగ్‎బాస్ సైతం అర్జున్ కు బాయ్ చెప్పినట్లుగా టాక్. ఇదే కాకుండా ఈ వారం రేవంత్ తో జరిగిన గొడవ కూడా అతనికి మైనస్ అయినట్లుగా సమాచారం. ఇందులో అప్పటివరకు కేవలం గేమ్ పై ఫోకస్ పెట్టిన అర్జున్.. రేవంత్ అన్న మాటను పట్టించుకోలేదు. ఆ తర్వాత శ్రీసత్య రెచ్చగొట్టడంతో రేవంత్ తో గొడవకు దిగాడు. ఆమె చెప్పడం వల్లే గొడవకు దిగాడు తప్పితే తనకు తానుగా రియాక్ట్ కాలేకపోవడం కూడా మైనస్ అయిటన్లుగా తెలుస్తోంది. దీంతో అతనికి ఓటింగ్ తగ్గడంతో ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ వారం అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు