Danush: ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ సూపర్ హిట్ మూవీ.. అమెజాన్ ప్రైమ్‎లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?..

తమిళ్ స్టార్ నటించిన నేనే వస్తున్నా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది.

Danush: ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ సూపర్ హిట్ మూవీ.. అమెజాన్ ప్రైమ్‎లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?..
Danush
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 22, 2022 | 4:15 PM

తమిళ్ స్టార్ హీరో ధనుష్ కు తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. అంతేకాకుండా ఈ హీరో ఇటీవల రెండు సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. తిరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఈ హీరో .. ఆ వెంటనే నానే వరువెన్ (తెలుగులో నేనే వస్తున్నా) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కానీ ఈ మూవీకి తమిళంలో సూపర్ హిట్ కాగా.. తెలుగులో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. ఇదే విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 27 నుంచి నేనే వస్తున్నా సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించగా.. ఇలి అవ్రామ్, ఇందుజా, యోగిబాబు కీలకపాత్రలలో నటించారు. కాదల్ కొండెన్, పుదుపేట్టై, మయక్కం ఎన్న వంటి హిట్స్ తర్వాత ధనుష్.. సెల్వరాఘవన్ కాంబోలో వచ్చిన సినిమా ఇది.

ప్రస్తుతం ధనుష్ సార్ సినిమాలో నటిస్తున్నారు. ద్విభాష చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని కలిగించాయి.

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై