Kavi Samrat – Aha: ఆహాలో ‘కవిసామ్రాట్’ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే.. ప్రేక్షకుల ముందుకు గొప్ప రచయిత జీవిత చరిత్ర..
గొప్ప రచయిత జీవితచరిత్రను డిజిటల్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతుంది ఆహా ఓటీటీ. తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన రచయిత ఆచార్యుడు.. తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత క్రీ. శే. విశ్వనాథ సత్యనారాయణ జీవిత చరిత్రను కవిసామ్రాట్ పేరుతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాలతో సినీ ప్రియులను ఆకట్టుకుంది తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. సూపర్ హిట్ సినిమాలు మాత్రమే కాకుండా.. టాక్ షోస్.. గేమ్ షోస్.. కుకింగ్ షోస్ అంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తుంది. తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా ఇతర భాషల్లోని హిట్ సినిమాలను డబ్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. తాజాగా గొప్ప రచయిత జీవితచరిత్రను డిజిటల్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతుంది ఆహా. తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన రచయిత ఆచార్యుడు.. తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత క్రీ. శే. విశ్వనాథ సత్యనారాయణ జీవిత చరిత్రను కవిసామ్రాట్ పేరుతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ఇందులో విశ్వనాథ సత్యనారాయణగా ప్రముఖ సీనియర్ నటులు ఎల్బీ శ్రీరామ్ కనిపించగా.. ఆయన సోదరుడిగా అనంత్.. తండ్రిగా సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి నటించారు. డైరెక్టర్ సవిత్ సి. చంద్ర దర్శకత్వం వహించగా.. జోశ్యభట్ల సంగీతం అందించారు. ఈ సినిమా ఇప్పుడు ఆహాలో సినీ ప్రియులను అలరిస్తోంది. ఈ మూవీ ఆహాలో అక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
ట్వీట్..
కవులకే కవి, మన తెలుగు జాతి సిరి, సాహితీ వటవృక్షం #కవిసమ్రాట్ #KavisamratOnAha Streaming now. ▶️https://t.co/TnQUbrHG6c @LB_Sriram pic.twitter.com/glUzxNIfE1
— ahavideoin (@ahavideoIN) October 21, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.