- Telugu News Photo Gallery Cinema photos Prabhas Birthday Special Know About Bahubali Star Known Facts About Him Check Here Telugu Film News
Prabhas Birthday Special: ప్రభాస్ హీరో కాకపోయి ఉంటే ఏం చేసేవాడో తెలుసా ?.. యంగ్ రెబల్ స్టార్ గురించి మీకు తెలియని విషయాలు..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. దేశమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అత్యథిక అభిమానులను సంపాదించుకున్న హీరో. ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 23 డార్లింగ్ పుట్టిన రోజు.
Updated on: Oct 22, 2022 | 8:39 PM

ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రభాస్ గురించి ప్రేక్షకులకు ఇప్పటివరకు తెలియని విషయాలు.. మీకోసం. డార్లింగ్ హీరో కాకపోతే ఏం అయ్యేవాడు.. ఏం చదువుకున్నాడో తెలుసుకుందామా.

ప్రభాస్ పూర్తిపేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. నటనకు ముందే హైదరాబాదులోని శ్రీ చైతన్య కళాశాలలో బీటెక్ పూర్తిచేశారు. స్వగ్రామం మొగల్తూరు.

ప్రభాస్ ముందు సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. ముందు హోటల్ వ్యాపారి కావాలనుకున్నాడు. ఇప్పుడు అనేక పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఆ తర్వాత సినీరంగంలో అడుగుపెట్టి స్టార్ హీరో అయ్యాడు.

ప్రభాస్ 'బాహుబలి' ఫ్రాంచైజీ కోసం 4 సంవత్సరాలు వెచ్చించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ చిత్రం అతని కెరీర్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది.

బహుబలి సమయంలో ప్రభాస్ ప్రతి ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశారు. అంతేకాకుండా రూ. 15 కోట్ల విలువైన ప్రకటనలు.. సినిమా ఆఫర్లను వదులుకున్నట్లుగా సమాచారం. ఫులు ఫోకస్ ఈ మూవీపైనే పెట్టాడు.

ప్రభాస్ ఫెవరేట్ రాజ్ కుమార్ హిరానీ. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.. తాను హిరానీ సినిమాలు అనేక చూశానని.. మున్నా భాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్ చిత్రాలు దాదాపు 12 సార్లు చూశానని తెలిపారు.

ప్రభాస్ చిత్రం 'బాహుబలి: ది బిగినింగ్' (2015) రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించబడుతున్న ఏకైక ఆంగ్లేతర చిత్రం. ఈ ఘనత డార్లింగ్ చిత్రానికే దక్కింది.

ప్రపంచ ప్రఖ్యాత మైనపు మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో తన మైనపు బొమ్మను కలిగి ఉన్న మొదటి దక్షిణ భారతీయ నటుడు ప్రభాస్ కావడం విశేషం. కేవలం సౌత్ నుంచి డార్లింగ్ బొమ్మ ఉంది.

ప్రభుదేవా నటించిన బాలీవుడ్ చిత్రం 'యాక్షన్ జాక్సన్'లో ప్రభాస్ అతిధి పాత్రలో నటించాడు. హాలీవుడ్ లెజెండ్ రాబర్ట్ డి నీరో ప్రభాస్ ఫెవరేట్ హీరో. రాబర్డ్ అభిమాని డార్లింగ్.





























