King Cobra: నీ ధైర్యం ఏంటి సామీ.. పడగ విప్పిన కింగ్ కోబ్రాకు కిస్‌.. ఒళ్లు జలదరించే వీడియో

భయంకరమైన కింగ్ కోబ్రాలను సైతం అలవోకగా పట్టుకుంటున్నారు స్నేక్‌ క్యాచర్లు. వాటిని చాకచక్యంగా పట్టుకుంటూ ముద్దులు కూడా పెడుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరలవుతున్నాయి.

King Cobra: నీ ధైర్యం ఏంటి సామీ.. పడగ విప్పిన కింగ్ కోబ్రాకు కిస్‌.. ఒళ్లు జలదరించే వీడియో
Kerala Snake Man
Follow us
Basha Shek

|

Updated on: Oct 22, 2022 | 9:44 AM

ప్రపంచంలో సుమారు 2వేలకు పైగా పాముల జాతులు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెబుతారు. వీటిలో కొన్నింటిలో విషం ఉండదని, మనుషులకు ఎలాంటి హాని తలపెట్టవంటున్నారు. అదే సమయంలో కొన్ని పాములు విషపూరితమని, ఇవి మనుషుల ప్రాణాలను క్షణాల్లోనే తీస్తాయంటున్నారు. కాగా పాము జాతుల్లో కింగ్‌ కోబ్రాకు ప్రత్యేక స్థానముంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషసర్పంగా దీనిని భావిస్తారు. అందుకే దాని పేరు వింటేనే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. పొరపాటున అవి తారసపడితే ఇక అంతే సంగతులు. క్షణాల్లో అక్కడి నుంచి మాయమవుతారు. అయితే భయంకరమైన కింగ్ కోబ్రాలను సైతం అలవోకగా పట్టుకుంటున్నారు స్నేక్‌ క్యాచర్లు. వాటిని చాకచక్యంగా పట్టుకుంటూ ముద్దులు కూడా పెడుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరలవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో మరొకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఒక వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి కింగ్‌ కోబ్రాను ముద్దాడాడు. కేరళలో ఈ ఘటన జరగ్గా.. దీనికి సంబంధించిన వీడియో ఒళ్లు జలదరింపజేస్తోంది.

వావా సురేశ్.. పాములు పట్టడంలో ఇతను దిట్ట. ఇతను ఎలాంటి పామునైనా సునాయాసంగా పట్టుకోగలడు. ఇప్పటి వరకు 50వేలకు పైగా పాములను పట్టుకున్న అనుభవం ఉంది. అందులో 190కిపైగా కింగ్‌ కోబ్రాలే ఉండటం విశేషం. అందుకే ఇతన్ని కేరళ ప్రాంత ప్రజలు ‘స్నేక్‌ మెన్‌ ఆఫ్‌ కేరళ’ అని పిలుస్తారు. సురేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అంతటా పాములకు పట్టిన వీడియోలు, ఫొటోలే ఉంటాయి. పామును పట్టుకునే యత్రంలో పలుమార్లు అదే పాము కాటుకు గురయ్యాడట. కొన్ని సార్లు అపస్మారక స్థితిలోకి కూడా వెళ్లాడట. ఈ ఏడాది జనవరిలో 10 అడుగుల పామును పట్టుకునే యత్నంలో కూడా అదే పాము కాటుకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతనిని వెంటిలేటర్‌పై చికిత్స చేసి అందించి కాపాడారు వైద్యులు.

ఇవి కూడా చదవండి

పాములతో ఆటలొద్దు సామీ..

కాగా పలుసార్లు పాము కాటుకు గురవ్వడంతో అతని చూపుడు వేలు, కుడి మణికట్టులో కదలికలను కూడా కోల్పోయినట్లు సురేష్‌ చెబుతున్నాడు. పాములు పట్టడం, వాటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటాడీ స్నేక్‌ క్యాచర్‌. అలా తాజాగా ఓ భారీ కింగ్‌ కోబ్రాను ముద్దాడుతోన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు సురేశ్. ఇందులో పాము పడగవిప్పి కోరలు బయటపెట్టి ఉండగానే దానికి ముద్దుపెట్టాడు సురేశ్‌. ఇది చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. కొందరైతే ఆడు మగాడ్రా బుజ్జీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అన్ని రోజులు మనవి కావని.. పాములతో పరచకాలొద్దని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్