ఈ పోటీలో గెలిచిన అమ్మాయిలకు బహుమతిగా ఎన్నారై పెళ్లికొడుకు !!
సాధారణంగా ఏదైనా పోటీలో గెలిచిన వారికి విలువైన వస్తువులు, మెమెంటోలు గిఫ్ట్‌గా ఇస్తారు. అదే అందాల పోటీల్లో అయితే గెలిచిన అమ్మాయిలకు కిరీటం పెట్టి, ఒక బిరుదు ఇస్తారు.
సాధారణంగా ఏదైనా పోటీలో గెలిచిన వారికి విలువైన వస్తువులు, మెమెంటోలు గిఫ్ట్‌గా ఇస్తారు. అదే అందాల పోటీల్లో అయితే గెలిచిన అమ్మాయిలకు కిరీటం పెట్టి, ఒక బిరుదు ఇస్తారు. కొంత నగదు కూడా ప్రజెంట్ చేస్తారు. కానీ ఇక్కడ నిర్వహించిన అందాల పోటీల్లో గెలిచిన యువతులకు వినూత్న బహుమతిని ప్రకటించారు నిర్వాహకులు. అది చూసి పోటీల్లో పాల్గొనేందుకు యువతులు పెద్దసంఖ్యలో ఎగబడ్డారు. చివరకు పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. పంజాబ్ లోని భటిండాలో అక్టోబరు 23న అందాల పోటీలు నిర్వహిస్తున్నట్టు, అందులో గెలిచినవారు కెనడాకు చెందిన ఎన్నారైని వరుడిగా పొందవచ్చని ప్రకటన చేస్తూ పోస్టర్లు అతికించారు. అంతేకాదు వాటిని సోషల్ మీడియాలో సైతం సర్క్యూలేట్ చేశారు. ఇంకేముంది? తమ కుమార్తెలకు ఎన్నారై సంబంధాల కోసం చూస్తున్న తల్లిదండ్రులతో పాటు పలువురు ఈ బ్యూటీ కంటెస్ట్‌పై ఆసక్తి చూపారు. అయితే, ఈ పోస్టర్ల విషయం తెలిసిన పోలీసులు అక్టోబరు 23వ తేదీన అందాల పోటీలను నిర్వహించాలని చూస్తున్న ఆర్గనైజర్స్‌పై కేసు నమోదు చేశారు. అందాల పోటీ విషయమై రూపొందించిన పోస్టర్లలో మహిళల గురించి అసభ్యకరమైన పదాలు రాసి ఉన్నట్టు గుర్తించామన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విద్యార్ధినిని 500 మీటర్లు ఈడ్చుకుపోయిన ఆటోడ్రైవర్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో.. గంటన్నరలో రూ. 70 లక్షలు
News Watch: గులాబీ పార్టీలోకి వలసల జోరు మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

