Rajinikanth: యంగ్ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేయనున్న సూపర్ స్టార్.. ఏ మూవీలోనంటే
రజినీకాంత్ నటించిన అన్నత్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టిన విషయం తెలిసిందే. దాంతో రజినీకాంత్ నెక్స్ట్ సినిమ కోసం ఆయన అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. దేశ విషయాల్లో రజినీకాంత్ కు ఫాన్స్ ఉన్నారు. ఆయన సినిమా వస్తుందంటేనే అభిమానులకు పండగ. రజినీకాంత్ నటించిన అన్నత్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టిన విషయం తెలిసిందే. దాంతో రజినీకాంత్ నెక్స్ట్ సినిమ కోసం ఆయన అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ తన నెక్స్ట్ మూవీ నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తోన్న విషయం తెలిసిందే. నెల్సన్ రీసెంట్ గా దళపతి విజయ్ తో బీస్ట్ మూవీని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు నెల్సన్. ఈ క్రమంలోనే ఓ పవర్ ఫుల్ కథతో సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే రజినీకాంత్ గెస్ట్ రోల్స్ చేయడం చాలా అరుదు. ఆయన అప్పుడెప్పుడో షారుఖ్ ఖాన్ నటించిన చిట్టి రోబో గా చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ఆయన మరో గెస్ట్ రోల్ చేయలేదు. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ ఓ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. అదికూడా ఓ యంగ్ హీరో సినిమాలో.
రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకురాలి చేస్తోన్న సినిమాలో రజినీకాంత్ గెస్ట్ అప్రియన్స్ ఇవ్వనున్నారట. అధర్వ మురళీ హీరోగా ఓ సినిమా చేయడానికి రెడీ ఐశ్వర్య. ఇందులో గెస్ట్ రోల్ చేయనున్నారట సూపర్ స్టార్. ఈ విషయాన్ని రజినీకాంత్ కి చెప్పగా.. ఆయన కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరాలోనే ఈ విషయం పై ఓ క్లారిటీ రానుంది.








