Happy Birthday Prabhas: రెబల్ స్టార్‌గా మాత్రమే కాదు మనసున్న మహారాజుగా అభిమానుల గుండెలో డార్లింగ్

అందుకోసం సినిమా తారలు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. అయినా కూడా అందరూ సక్సెస్ కాలేరు. కానీ ఓ హీరో మాత్రం తండ్రి, పెద్దనాన్న అండతో సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు తనంతట తానే భారీ అభిమానగణం ను ఏర్పరుచుకున్నారు

Happy Birthday Prabhas: రెబల్ స్టార్‌గా మాత్రమే కాదు మనసున్న మహారాజుగా అభిమానుల గుండెలో డార్లింగ్
Prabhas
Follow us

|

Updated on: Oct 23, 2022 | 6:12 AM

వారసులుగా వచ్చి సినిమా రంగంలో రాణించడం అంత ఆషామాషీ విషయం కాదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఈజీగా ఇచ్చేయొచ్చు కానీ వచ్చిన తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలి. అందుకోసం సినిమా తారలు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. అయినా కూడా అందరూ సక్సెస్ కాలేరు. కానీ ఓ హీరో మాత్రం తండ్రి, పెద్దనాన్న అండతో సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు తనంతట తానే భారీ అభిమానగణం ను ఏర్పరుచుకున్నారు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కంటిన్యూ అయినా ఈ హీరోగారు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియానే కాదు.. పాన్ వరల్డ్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆయనే మన డార్లింగ్ ప్రభాస్. నేడు ప్రభాస్ పుట్టిన రోజు.

ఇక ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా ఒక్కటి చాలు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అనడానికి..  అమరేంద్ర బాహుబలిలా ప్రభాస్ ఠీవిగా నడిచి వస్తుంటే, రాజంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్ల కలెక్షన్, కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆ కటౌట్ కి మైనపు ప్రతిమను బ్యాంకాక్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టించారు. నిర్మాతగా ఉన్న తండ్రి సూర్య నారాయణ రాజు, హీరోగా చేసిన పెద్దనాన్న కృష్ణం రాజు తర్వాత వారసుడిగా ఈశ్వర్ తో పరిశ్రమలోకి అడుగుపెట్టి వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి, సాహో లాంటి భారీ విజయాలని సాధిస్తూ ప్రభాస్ 20 ఏళ్ళలో ప్రతి చిత్రానికి చాలా కష్టపడుతూ, తనని తాను ఎప్పటికప్పుడు కొత్తగా మలుచుకుంటూ, రెబెల్ స్టార్ నుండి పాన్ ఇండియన్ స్టార్ స్థాయిని దాటి అంతర్జాతీయ అభిమానులని గెలుచుకున్నాడు.

అసలు ప్రభాస్ లేకపోతే బాహుబలి చిత్రమే లేదు అని దర్శధీరుడు రాజమౌళి స్వయంగా అన్నారంటే అతని డెడికేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. 20 ఏళ్ళ పాటు ప్రేక్షకుల హృదయాల్లో మకుటం లేని మహారాజులా ఎదుగుతూ, దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి వచ్చినా కూడా ఏ మాత్రం గర్వం లేకుండా తన సహ నటులతో మిగతా బృందంతో ఆప్యాయంగా ‘డార్లింగ్‌’ అని పిలుస్తూ పిలిపించుకుంటూ ఉంటారు ప్రభాస్‌. తన కేరిర్ లో ఎలాంటి కాంట్రవర్సీ జోలికి పోకుండా తనతో పని చేసిన దిగ్గజ నిర్మాతలు, దర్శకులు మళ్ళీ మళ్ళీ తనతో పని చేయాలనిపిస్తుంది అని చెప్తున్నారంటే నటుడిగా తన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్ధమవుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ప్రభాస్ చిత్రం కోసం టాలీవుడ్ బాలీవుడ్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. వాల్మీకి రామాయణంలో రాముడి వర్ణనకి తగ్గట్టుగా ఉండే ఆహార్యం సహజంగానే ఉన్న ప్రభాస్ ఇందులో రాఘవ రాముడిగా కనిపించనుండగా పూర్తి 3డి టెక్నాలజీ తో 250 కోట్ల విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం కనిపించనుంది. అలాగే కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ హీరోగా డార్క్ సెంట్రిక్ థీం టెక్నాలజీ ని వాడుతూ తెరకెక్కుతున్న ఇండియాలో మొట్ట మొదటి భారీ చిత్రం ‘సలార్’. ఇందులోని యాక్షన్, విజువల్స్ ఇదివరకెన్నడూ చూడని స్థాయిలో ఉంటాయని చిత్రంలో నటించిన నటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు చెప్పడం విశేషం.

వైజయంతి మూవీస్ లాంటి ప్రఖ్యాత నిర్మాణ సంస్థలో దాదాపూ 500 కోట్ల బడ్జెట్ తో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కె’ పై విపరీతమైన అంచనాలున్నాయి. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లాంటి పాన్ ఇండియన్ నటులు ఇందులో భాగమవుతుండగా, మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ తోడవ్వడం తో ఈ చిత్రానికి ప్రపంచ దేశాల్లో భారీ మార్కెట్ దక్కనుంది. ఇది కాక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తోనూ దర్శకుడు మారుతి తో కూడా భారీ చిత్రాలు త్వరలో మొదలవ్వనున్నాయి.

గత 20 ఏళ్లు గా ప్రభాస్ ఎన్నో సేవా సహాయ కార్యక్రమాలు చేసాడు. వరదలు వచ్చినపుడు, కోవిడ్ సమయంలోనూ ఎన్నో భారీ విరాళాలు ఇచ్చారు. అలాగే 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకోవడమే కాక అందులో తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ అభివృద్ధి కి కావలసిన ఎన్నో సౌకర్యాలు సమకూర్చారు. ఇలా రెబల్ స్టార్ గా మాత్రమే కాక మంచి మనసున్న మహారాజుగా అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ప్రభాస్‌.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!