Diwali 2022: వామ్మో.. సిగరెట్లతో దీపావళి రాకెట్లను వెలిగిస్తోన్న వృద్ధుడు.. ఇవేం పనులంటూ నెటిజన్ల ఆగ్రహం
ఈ వీడియోలో ఒక వృద్ధుడు సిగరెట్ వెలిగించి.. తర్వాత అదే సిగరెట్‌తో దీపావళి రాకెట్లను వెలిగించి గాల్లోకి వదులుతున్నాడు. ఈ వీడియో వైరల్ అవ్వగానే నెటిజన్లు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు.
దీపావళి అంటేనే పటాకు పండగ. ఈ పర్వదినానా పిల్లలతో పాటు పెద్దలు బాణసంచా కాల్చేందుకు ఇష్టపడతారు . అయితే కొందరు పటాకులతో రకరకాల విన్యాసాలు చాలాసార్లు చేస్తుంటారు. చెంబులు, కుండలు తదితర పాత్రల్లో పటాకులు పెట్టి కాల్చడం మనం చూస్తూనే ఉంటాం. వాటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ వీడియోలో ఒక వృద్ధుడు సిగరెట్ వెలిగించి.. తర్వాత అదే సిగరెట్‌తో దీపావళి రాకెట్లను వెలిగించి గాల్లోకి వదులుతున్నాడు. ఈ వీడియో వైరల్ అవ్వగానే నెటిజన్లు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. వృద్ధుడి సాహసాన్ని మెచ్చుకుంటూ రాకెట్ అంకుల్, నాసా సైంటిస్ట్ అని పేర్లు పెడుతున్నారు. అదే సమయంలో కొందరు మాత్రం ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని.. అవి ప్రమాదకరమని.. పిల్లలు కూడా అలా చేసే అవకాశముందని మండిపడుతున్నారు. పైగా పెద్ద మనిషివై ఉండి అందరికీ పొగత్రాగరాదు అని చెప్పాల్సింది పోయి.. ఇలా సిగరెట్లతో రాకెట్లు కాల్చడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోను ప్రముఖ ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. అయితే ఇందులోని వ్యక్తికి సొంతంగా క్రాకర్స్ బిజినెస్ ఉందట. తాను ఎన్నో ఏళ్లు ప్రాక్టీసు చేస్తే గానీ ఇలా చేయడం సాధ్యం కాలేదంటున్నారు సదరు సీనియర్ సిటిజన్. గతంలో కూడా ఎన్నోసార్లు ఇలా చేశానంటున్నాడు. క్రాకర్స్ వ్యాపారంతో పాటు వ్యవసాయం చేసే ఆయన తారాజువ్వలతో ప్రయోగాలు చేయడమంటే చాలా ఇష్టమంటున్నాడు. అయితే ఈ వీడియోను చూసిన వారందరూ దీపావళి వేళ ఇలాంటి ప్రయోగాలు చేయద్దంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఎకోఫ్రెండ్లీగా ఫెస్టివల్‌ను జరుపుకోవాలని సూచిస్తున్నారు.
The founder of NASA was definitely from India ?? pic.twitter.com/lbWlbjHB07
ఇవి కూడా చదవండి— Susanta Nanda (@susantananda3) October 21, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..