Proposal Video: విదేశీ అమ్మాయి కోసం యువకుడి తిప్పలు.. ఓ రేంజ్ లో స్టంట్స్ చేస్తూ ప్రపోజ్.. ఫన్నీ వీడియో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో ఒక దేశీ కుర్రాడు రోడ్డుమీద వెళ్తున్న విదేశీ అమ్మాయిలను చూశాడు. దీంతో చేతిలో గులాబీ పువ్వు పట్టుకుని.. ఓ రేంజ్ లో స్టంట్స్ చేస్తూ ప్రపోజ్ చేశాడు. నడిరోడ్డుపై అద్భుతమైన విన్యాసం చేశాడు.

Proposal Video: విదేశీ అమ్మాయి కోసం యువకుడి తిప్పలు.. ఓ రేంజ్ లో స్టంట్స్ చేస్తూ ప్రపోజ్.. ఫన్నీ వీడియో వైరల్
Boy Backflip To Propose
Follow us
Surya Kala

|

Updated on: Oct 23, 2022 | 11:39 AM

స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత..  రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రజలపై సోషల్ మీడియా అద్భుతమైన ముద్ర వేసింది. గతంలో కేవలం వార్తలు విశేషాల కోసం వినియోగిస్తే.. నేడు.. వినోదం కోసం కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజూ రకరకాల వీడియోలు వైరల్ అవడానికి ఇదే కారణం . కొన్ని వీడియోలు ఆశ్చర్యపడేటట్లు చేస్తే.. మరికొన్ని సరదాగా ఉండి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్నాయి. ప్రస్తుతం అటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక దేశీ కుర్రాడు రోడ్డుమీద వెళ్తున్న విదేశీ అమ్మాయిలను చూశాడు. దీంతో చేతిలో గులాబీ పువ్వు పట్టుకుని.. ఓ రేంజ్ లో స్టంట్స్ చేస్తూ ప్రపోజ్ చేశాడు. నడిరోడ్డుపై అద్భుతమైన విన్యాసం చేశాడు. అయితే చివరికి ఆ అమ్మాయి రియాక్షన్ చూసి ఆ యువకుడితో సహా అందరూ షాక్ తిన్నారు. నవ్వుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక అబ్బాయి విదేశీ అమ్మాయిలను చూసి వారి వైపు పరిగెత్తాడు. తన ఎదురుగా ఆ అమ్మాయిల బృందం వచ్చిన వెంటనే.. ఆ యువకుడు.. ఓ అమ్మాయిని ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా అమ్మాయి ముందు బ్యాక్ ఫ్లిప్ చేసి.. ఆ యువతిని ఆకట్టుకోవడానికి మోకాళ్లపై నిలబడ్డాడు. అమ్మాయికి గులాబీ పువ్వు ని ఇచ్చేప్రయత్నం చేశాడు. అయితే ఆ విదేశీ అమ్మాయి తమ బృందంలోని అమ్మాయిలతో ముందుకు వెళ్ళింది. అలా వెళ్లే సమయంలో అబ్బాయి పచేతిలోని గులాబీని తీసుకోవడానికి నిరాకరించినట్లు తలను అడ్డంగా తిప్పింది. ఆ యువకుడిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళింది.  ప్ర

ఈ వీడియో monty_parkourr అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేశారు. ఈ వీడియోకి ఆరు లక్షలకు పైనా లైక్స్, రకరకాల కామెంట్స్ వచ్చాయి. ‘బాధపడకు సోదరా..  విదేశీయులు ఎవరికీ విధేయులు కారని అంటే.. , ‘బ్రదర్ నెక్స్ట్ టైమ్ నిక్కర్ వేసుకుని ప్రపోజ్ చేయవద్దు’ అని సలహా ఇచ్చాడు. మరొకరు.. ఆ యువకుడిని ఎంకరేజ్ చేస్తూ.. మరొకరు వస్తారు.. చింతించకు నీ స్టంట్ నిజంగా అద్భుతంగా ఉంది’ అని కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వైరల్ వీడియోలపై ఓ లుక్ వేయండి..