Street Food: నేటి తరానికి స్ఫూర్తి ఈ జంట.. పానీ పూరి స్టాల్ ను నడుపుతున్న వినికిడిలోపం ఉన్న దంపతులు
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో.. దంపతులు ఇద్దరూ తమ స్టాల్ వద్ద సైగలను చేస్తూ కస్టమర్స్ కు ఆహారపదార్ధాల గురించి వివరిస్తున్నారు. ఈ జంట కస్టమర్‌లతో సంజ్జల తో కమ్యూనికేట్ చేస్తున్నారు.
మనిషి బతకాలంటే కావాల్సింది ఏమిటి అంటే.. ఇప్పటి వరకూ ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న కారణాలతో తమ ఊరిపిని తీసుకునేవారున్నారు.. అదే సమయంలో తమకు ఎదురైనా కష్టలను.. దైర్యంగా ఎదుర్కొంటు.. తమలోని లోపాలను అధిగమిస్తూ.. జీవిస్తున్న చాలా స్పూర్తిదాయకమైన వ్యక్తులున్నారు. నేటి యువతకు స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప జంట గురించి ఈరోజు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని నాసిక్‌లో మూగ చెముడు ఉన్న దంపతులు తమకు జీవితంలో ఎదురైన సవాళ్లను చాలా దృఢ సంకల్పంతో ఎదుర్కొంటున్నారు. సదా చిరునవ్వు ముఖంతో వాటిని అధిగమిస్తున్నారు. ఈ జంట పానీ పూరీ స్టాల్ నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో.. దంపతులు ఇద్దరూ తమ స్టాల్ వద్ద సైగలను చేస్తూ కస్టమర్స్ కు ఆహారపదార్ధాల గురించి వివరిస్తున్నారు. ఈ జంట కస్టమర్‌లతో సంజ్జల తో కమ్యూనికేట్ చేస్తున్నారు. తమ బండి దగ్గరకు వచ్చే కస్టమర్స్ బృందానికి ఏమి కావాలన్నా సైగలతోనే అడుగుతారు. ఈ వీడియోలో మహిళ సంజ్ఞలను ఉపయోగించి మసాలా ఎక్కువ అయిందా.. సరిపోయిందా అంటూ కస్టమర్‌ని అడగడం చూడవచ్చు. ఆమె కరకరలాడే పూరీలకు రుచిగల పుదీనా వాటర్ ను జోడించి..ఆ నోరూరించే ప్లేట్‌ను కెమెరాకు చూపుతుంది.
నాసిక్‌లోని అడ్గావ్ నాకా సమీపంలో ఉన్న స్టాల్
చెవిటి , మూగ జంట నాసిక్‌లోని అడ్గావ్ నాకాలో హోటల్ దగ్గర తమ జీవనోపాధిగా చిన్న పానీ పూరీ స్టాల్‌ను నడపడానికి నిర్ణయించుకున్నారు. తమకున్న లోపాలను అధిగమించి వినియోగదారులకు అవసరమైన సేవలను అందిస్తున్నారు. వారు ఈ స్టాల్ లో అందిస్తున్న ఆహారపదార్ధాలన్నీ ముందుగానే ఇంట్లోనే తయారు చేస్తారు. చివరికీ పానీ పూరీలు కూడా. అంతేకాదు.. తాము కస్టమర్స్ కు ఆహారాన్ని అందజేసేటప్పుడు పరిశుభ్రతను పాటిస్తారు. ఈ జంట నుంచి నేటి తరం వారు అనుసరించాల్సిన, నేర్చుకోవలసింది ఎంతో ఉందంటున్నారు. జాత్రా , నాసిక్.”
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఫుడ్ వ్లాగర్ ‘స్ట్రీట్ ఫుడ్ రెసిపీస్’ పోస్ట్ చేసింది.
View this post on Instagram
ఈ జంట స్ఫూర్తిపై ప్రశంసల వర్షం: ఈ వీడియో 3.7 మిలియన్లకు పైగా వీక్షణలను సొంతం చేసుకుంది. నేటి తరానికి నిజమైన స్ఫూర్తిగా మీరు నిలిచారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ప్రతి ఒక్కరూ వీరి స్టాల్ ను సందర్శించి వారి మనోధైర్యాన్నిచూసి మరింత నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగా స్ఫూర్తిదాయకం,” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. “నేను నాసిక్ వెళ్ళినప్పుడు తప్పనిసరియా ఈ జంటను కలుస్తాను. ఇదే నిజమైన ప్రేరణ” అని ఒకరు రాశారు. “నేను చూసిన క్లీనెస్ట్ స్టాండ్! నేను ఖచ్చితంగా అక్కడ తింటాను,” మరొకొందరు చెప్పారు. ఈ దంపతులు వ్యాపారం కోసం కంటే వారు దానిని ప్రజలకు ప్రేమ, శ్రద్ధతో విక్రయిస్తున్నట్లు అనిపిస్తుంది” అని మరొకరు హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..