Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kid Panting: వైట్ కారుపై రెడ్ లిప్‌స్టిక్‌ తో బాలుడు గీతలు.. ఫన్నీ వీడియో చూసి నవ్వనివారు ఉండరేమో..

ఈ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు కారు దగ్గర ఓ పెయింటింగ్ దుకాణం తెరిచేశాడు. అమ్మ వేసుకునే లిప్ స్టిక్స్ ను ఓ రేంజ్ లో కారు దగ్గర పెట్టుకుని.. ఓ రెడ్ కలర్ లిప్‌స్టిక్‌ని తీసుకుని కారు మొత్తం రకరకాల షేప్స్ లో గీతాలతో నింపాడు.

Kid Panting: వైట్ కారుపై రెడ్ లిప్‌స్టిక్‌ తో బాలుడు గీతలు.. ఫన్నీ వీడియో చూసి నవ్వనివారు ఉండరేమో..
Little Boy Painting On Car
Follow us
Surya Kala

|

Updated on: Oct 22, 2022 | 9:50 AM

పిల్లలు దేవుడితో సమానం అంటారు పెద్దలు. అమాయకత్వం.. అసూయాద్వేషాలంటే తెలియని పసి వయసులో బోసి నవ్వులతో వారు చేసే ఏ పని అయినా ముద్దుగానే ఉంటుంది. అందుకనే అమాయకమైన ముఖంతో పిల్లలు  చేసే కొన్ని కొన్ని పనుల వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఎందుకంటే పసివారికి ఏమి చేయాలో, ఏం చేయకూడదో తెలియదు. అలాంటి పరిస్థితిలో.. కొన్ని సార్లు పిల్లలు చేసే పనులు.. నవ్వుని కలిగిస్తే.. మరికొన్ని సార్లు కొట్టాలి అన్నంత కోపాన్ని తెప్పిస్తాయి.  అయితే చాలావరకూ పిల్లల గురించి తెలుసుకనుక.. వారి చేష్టలను పెద్దలు పట్టించుకోరు. ముఖ్యంగా పిల్లలు పెన్సిల్, కలర్స్, పెన్ను ఏది దొరికినా ముందుగా అందుబాటులో ఉన్న పుస్తకాల్లో పిచ్చి గీతలు గీస్తారు. అప్పటికీ సంతృప్తీ చెందకపోతే.. అప్పుడు ఇంటిపై పడుతుంది పిల్లల దృష్టి.. ఇంటి గోడలు, నేల, ఫర్నీచర్ ఇలా కనిపించిన ప్రతిదానిపైనా గీతలు గీయడం మొదలు పెడతారు. అప్పుడు ఇంట్లోని తల్లిదండ్రులకు వాటిని వదిలించుకోవడం ఓ టాస్క్ గా మారుతుంది. ఒకొక్కసారి సారి పిల్లలపై కోపం కూడా వ్యక్తం చేస్తారు.  తాజాగా ఓ చిన్నారి బాలుడు అల్లరి చేష్టల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు నవ్వడం ఖాయం.

ఈ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు కారు దగ్గర ఓ పెయింటింగ్ దుకాణం తెరిచేశాడు. అమ్మ వేసుకునే లిప్ స్టిక్స్ ను ఓ రేంజ్ లో కారు దగ్గర పెట్టుకుని.. ఓ రెడ్ కలర్ లిప్‌స్టిక్‌ని తీసుకుని కారు మొత్తం రకరకాల షేప్స్ లో గీతాలతో నింపాడు. తెల్లటి కారుపై ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో రంగులను పూశాడు.. తర్వాత అక్కడే లిప్ స్టిక్ ను పడేసి.. అక్కడ ఉన్న బొమ్మ కారుమీద కూర్చుని అక్కడ నుంచి పారిపోవడం చూడవచ్చు ఈ వీడియోలో.. చిన్నారి బాలుడు ఇలా కారుమీద గీతలు గీస్తున్నదంటే.. ఆ కారు యజమాని చిన్నారిని ఎంతగా ఇబ్బంది పెట్టాడో అంటూ కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. వైరల్ అవుతున్న వీడియోలో చిన్నారి యాక్షన్ చూస్తుంటే..  లిప్ స్టిక్ తో కావాలనే కారు డోర్స్ ని నింపినట్లు తెలుస్తోంది. కారుపై లిప్‌స్టిక్‌ను పూసిన తర్వాత, పిల్లవాడు హాయిగా తన బొమ్మ కారుపై కూర్చుని పారిపోతాడు. ఇప్పుడు ఆ పిల్లాడి ఈ ఫన్నీ  యాక్షన్ నవ్వకుండా ఎవరైనా ఉండడం కష్టం.

చిన్నారి యొక్క ఈ ఫన్నీ వీడియో @MorissaSchwartz అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో భాగస్వామ్యం చేయబడింది. ఈ   వీడియోను ఇప్పటివరకు లక్షలాది వ్యూస్ ను, వందలాది  లైక్స్ ను సొంతం చేసుకుంది. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ధనవంతుల పిల్లలు ఇలాగే చేస్తారని ఒకరు కామెంట్ చేస్తే.. మరికొందరు తన పిల్లాడిని పంపించి ఇలా చేయమంది అంటూ సరదాగా  కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..