Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజంగా చిరంజీవే.. కారు పైకి ఎక్కినా లేచి పరుగులు పెట్టిన చిన్నారి.. షాకింగ్ వీడియో!

కారు డ్రైవర్ కూడా బ్యాలెన్స్ చేసుకోలేని విధంగా ఆ అమ్మాయి సడన్ గా కారుని ఢీ కొట్టడంతో.. ఫ్రంట్ వీల్ బాలిక మీద నుంచి వెళ్ళిపోయింది. అయితే అదృష్టవశాత్తూ బాలికకు ఎటువంటి ప్రమాదం జరగలేదు..

నిజంగా చిరంజీవే.. కారు పైకి ఎక్కినా లేచి పరుగులు పెట్టిన చిన్నారి.. షాకింగ్ వీడియో!
Accident Viarl Video
Follow us
Surya Kala

|

Updated on: Oct 22, 2022 | 1:24 PM

జీవితం క్షణ భంగురం అన్నారు పెద్దలు.. ఒకొక్కసారి ఈ మాటలను గుర్తు చేసుకోవాల్సిన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే..అప్పటి వరకూ సరదాగా ఉన్నవారు ఒక్క క్షణంలో ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు చాలామంది జీవితాల్లో ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల విషయంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. రోడ్డుమీద వెళ్తున్న వారు ప్రమాదం బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఖ్య అధికంగానే ఉంది. ముఖ్యంగా నిత్యం అధిక సంఖ్యలో వాహనాలు వస్తూ పోతూ ఉండే రోడ్లకు ప్రమాదాలకు అడ్డాగా మారాయి. కనుక మీరు రోడ్డుపై నడుస్తుంటే, చాలా జాగ్రత్తగా నడవండి . మీరు కారులో వెళ్లవలసి వస్తే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రహదారి మీద నడిచే పిల్లల విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. చాలా సార్లు పిల్లలు రోడ్డు మీదకు వచ్చి తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకున్న ఘటనలు చూసి ఉంటారు. ప్రస్తుతం అలాంటి ఓ  వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా గూస్‌బంప్స్ ఫీలింగ్ ను ఎదుర్కొంటారు.

నిజానికి ఈ వీడియోలో ఓ బాలిక ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా చిన్నారిపై కారు ఎక్కింది. అయితే అమ్మాయి పూర్తిగా సురక్షితంగా కారు నుండి బయటకు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ వీడియోలో ఓ అమ్మాయి తన బొమ్మ కారును నడుపుతూ రోడ్డుమీద వెళ్తోంది. హఠాత్తుగా బాలిక కారుకి ఎదురుగా కారు వచ్చింది. దీంతో బాలిక బొమ్మ కారుని నేరుగా కారును ఢీ కొట్టింది. కారు డ్రైవర్ కూడా బ్యాలెన్స్ చేసుకోలేని విధంగా ఆ అమ్మాయి సడన్ గా కారుని ఢీ కొట్టడంతో.. ఫ్రంట్ వీల్ బాలిక మీద నుంచి వెళ్ళిపోయింది. అయితే అదృష్టవశాత్తూ బాలికకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.. ప్రాణాలను దక్కించుకున్న చిన్నారి.. ఏమీ జరగనట్లే కారు కిందనుంచి బయటకు వచ్చి.. లేచి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదం వీడియో చూసిన వారు షాక్ తింటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ హృదయ విదారక వీడియోను IPS అధికారి దీపాంషు కబ్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.  ఇలాంటి ప్రమాదం నుంచి బాలిక బయటపడిందంటే నమ్మడం కష్టం. కారు డ్రైవర్ తీవ్ర జాగ్రత్తలు తీసుకున్నాడు.. కనుకనే బాలికకు ప్రాణాపాయం నుంచి బయటపడి ఉండొచ్చు అని కామెంట్ చేస్తున్నారు. ఈ 9 సెకన్ల వీడియో ఇప్పటి వరకు 10 వేలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. వందలాది మంది లైక్ చేశారు. ప్రస్తుతం అజాగ్రత్త వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి’ అని ఒక యూజర్ రాస్తే, ‘అద్భుతం అంటారు కదా, మొదటి 5 సెకన్లు చూసిన తర్వాత ఊపిరి ఆగిపోయింది, ఆ అమ్మాయి అయితే క్షేమంగా ప్రాణాలతో బయటపడింది అది చాలు అని మరొకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..