మటన్ కూర కోసం కొట్టుకుంటున్న భార్యాభర్తలు.. మధ్యలో వెళ్లి మర్డర్ అయిన మూడో వ్యక్తి..

భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంటే మూడో వ్యక్తి జోక్యం చేసుకోద్దని  పెద్దలు చెప్పిన మాటను పక్కకు పెట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధానిలో వెలుగు చూసింది.

మటన్ కూర కోసం కొట్టుకుంటున్న భార్యాభర్తలు.. మధ్యలో వెళ్లి మర్డర్ అయిన మూడో వ్యక్తి..
Madhya Pradesh News
Follow us

|

Updated on: Oct 22, 2022 | 12:15 PM

మాంసాహారం అంటే కొందరికి యమా ప్రీతి.. ఎప్పుడెప్పుడాని లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. అలానే ఓ వ్యక్తికి మాంసాహారం భలే ఇష్టం. ఇక ఇంటికి మటన్ తీసుకొచ్చాడు. కానీ భార్య వండేందుకు నిరాకరించింది. మంగళవారం రోజు ఇంట్లో మటన్ వండుతావా? అంటూ ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చిన ఓ వ్యక్తిని దారుణ హత్యకు గురయ్యాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంటే మూడో వ్యక్తి జోక్యం చేసుకోద్దని  పెద్దలు చెప్పిన మాటను పక్కకు పెట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధానిలో వెలుగు చూసింది. భోపాల్ లో పప్పు అర్హ్ వార్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే తనకు ఇష్టమైన మటన్‌ను ఇంటికి తీసుకొచ్చాడు. వండాలని భార్యను ఆదేశించాడు. కానీ మంగళవారం హనుమాన్ పూజిస్తానని మటన్ వండనని తేల్చిచెప్పింది. అసలు ఇంట్లోకి మటన్ ఎందుకు తెచ్చావని ప్రశ్నించింది. ఇక భర్తే వంట చేసేందుకు ప్రిపేర్ అయ్యాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

వీరి గొడవను పక్కింట్లో ఉండే బిల్లు అనే వ్యక్తి.. భార్యాభర్తలకు సర్దిచెప్పాడు. దీంతో తీవ్ర అవమానానికి గురైన పప్పు.. బిల్లును కర్రతో చావబాదాడు. బబ్లూకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరుగుపొరుగు వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బబ్లూ తలకు బలమైన గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో నిందితుడైన భర్త పప్పు అహిర్వార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అన్ని ఆధారాలను సేకరించిన పోలీసులు పప్పు అహిర్వార్‌ను జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి భోపాల్ సెంట్రల్ జైలుకు పంపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..