AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali: దీపావళిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు జరుపుకుంటారు.. మరి ఉత్తరాదికంటే దక్షిణాదిలో భిన్నంగా సెలబ్రేషన్స్.. రీజన్ ఏమిటంటే

పావళి వేడుకలు భారతదేశంలోని రెండు ప్రాంతాలలో ఒకే రోజున జరుపుకుంటారు.. అయితే ఉత్తరాదిన ఐదురోజుల పాటు అత్యంత ఘనంగా జరుపుకుంటే.. దక్షిణాదిలో మాత్రం రెండు రోజులు జరుపుకుంటారు.

Diwali: దీపావళిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు జరుపుకుంటారు.. మరి ఉత్తరాదికంటే దక్షిణాదిలో భిన్నంగా సెలబ్రేషన్స్.. రీజన్ ఏమిటంటే
Diwali In South And North I
Follow us
Surya Kala

|

Updated on: Oct 22, 2022 | 10:33 AM

దేశ వ్యాప్తంగా దీపావళి సందడి మోడలింది. ఈ పండగను భారతదేశం అంతటా తమ తమ ప్రాంతాల్లోని సాంప్రదాయాలను అనుసరిస్తూ తమదైన రీతిలో జరుపుకుంటారు. దీపావళిని ఉత్తర, పశ్చిమ,మధ్య భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. అయితే  భారతదేశంలోని ఇతర ప్రాంతాలోని ప్రజలు భిన్నంగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో జరుపుకునే దీపావళికి ఉత్తర భారతదేశంలో జరుపుకునే దీపావళికి కొన్ని తేడాలున్నాయని మీకు తెలుసా.. దీపావళి వేడుకలు భారతదేశంలోని రెండు ప్రాంతాలలో ఒకే రోజున జరుపుకుంటారు.. అయితే ఉత్తరాదిన ఐదురోజుల పాటు అత్యంత ఘనంగా జరుపుకుంటే.. దక్షిణాదిలో మాత్రం రెండు రోజులు జరుపుకుంటారు. ఉత్తర , దక్షిణ భారతదేశంలో దీపావళిని ఎలా విభిన్నంగా జరుపుకుంటారో ఈరోజు తెలుసుకుందాం..

ఉత్తర భారతదేశంలో దీపావళిని ఎలా జరుపుకుంటారంటే..

  1. 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు.. అయోధ్యలో దీపాలు, రంగు రంగు ముగ్గులతో అలంకరించి ప్రజలు శ్రీరాముడికి స్వాగతం చెప్పాలని ఉత్తరాదివాసుల నమ్మకం. అందుకనే ఈ ప్రాంత ప్రజలందరూ రంగు రంగుల రంగవల్లుళ్లను వేస్తారు.. దీపాలతో అలంకరిస్తారు.
  2. దీపావళి రోజున గణపతిని, లక్ష్మీ దేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఏడాది పొడవునా సుఖసంతోషాలతో ఉంటామని నమ్మకం.
  3. ఇవి కూడా చదవండి
  4. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలోని  ప్రజలు ఇళ్లను లైట్లు, దీపాలు, ఇతర వస్తువులతో అలంకరిస్తారు. అంతే కాకుండా రంగోలికి కూడా అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు.
  5. ఉత్తర భారతదేశంలో దీపావళికి రెండు రోజుల ముందు ధన్ తేరాస్ ను జరుపుకుంటారు. ఈ రోజున బంగారు ఆభరణాలు కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతేకాదు ఈ రోజున కుబేరుడిని పూజించే సాంప్రదాయం కూడా ఉత్తర భారతదేశంలో ఉంది. దీనితో పాటు, దీపావళిని హిందూ ఆర్థిక సంవత్సరం ప్రారంభంగా వ్యాపారవేత్తలు భావిస్తారు.
  6. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో, దీపావళి పండుగలు లేదా రకరకాల ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తారు.

దక్షిణ భారతదేశంలో దీపావళిని ఎలా జరుపుకుంటారంటే:

  1. శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ సమేతంగా నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన లోకాన్ని రక్షించడానికి.. అప్పటి నుంచి  దీపావళిని జరుపుకోవడం ఆచారంగా మారిందని దక్షిణ భారతదేశంలోని ఓ నమ్మకం. అందుకనే దక్షిణాదిలో చాలా ప్రాంతాలలో దీపావళి జరుపుకుంటారని చెబుతారు.
  2. దీపావళికి ఒక రోజు ముందు రోజుని  దక్షిణ భారతదేశంలో నరక చతుర్దశి అంటారు.  నరకాసుర వధని నరక చతుర్దశిగా జరుపుకుంటూ.. ఆరోజు ఉదయమే అభ్యంగ స్నానం చేస్తారు. సాయంత్రం యమ దీపాలు పెడతారు.
  3. దీపావళి సందర్భంగా ప్రజలు కూడా ఇక్కడ స్వీట్లు ఇచ్చిపుచ్చుకుంటారు. తమకు ప్రియమైన వారిని కలవడానికి వెళతారు. అంతేకాదు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పే ఆచారం దక్షిణ భారతదేశంలో ఉంది.
  4. నరక చతుర్దశి రోజున చాలా మంది ప్రజలు నూనెతో తలస్నానం చేసి, ఆ తర్వాత ఆలయానికి వెళ్లి పూజలు చేసి రోజును ప్రారంభిస్తారు. లేదంటే ఇంట్లో పూజలో పాల్గొంటారు.
  5. మర్నాడు అంటే దీపావళి అమావాస్య రోజున సాయంత్రం కొత్తబట్టలు ధరించి దీపాలను వెలిగిస్తారు. కొంతమంది గోంగూర కర్రలను ఉపయోగించి దివిటీలు కొట్టే సంప్రాదయని పాటిస్తారు..
  6. మొత్తానికి దీపావళి వేడుకలు ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశంలో కొంచెం తక్కువగానే ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)