- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: Parijat Tree(Harsingar Plant)Vastu Placement At Home to improve financial status
ఆర్ధిక ఇబ్బందులా ఇంట్లో పారిజాతం మొక్కను ఇలా పెంచుకోండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం
హిందూ మతంలో పారిజాత మొక్కకు విశిష్ట స్థానం ఉంది. పారిజాతం పువ్వులు చాలా పవిత్రమైనవి. ముఖ్యంగా దేవుడికి చేసే పూజలో పాతిజాతం పువ్వులకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ పారిజాతం పువ్వులకు ఏ పువ్వులకు లేని విధంగా చెట్టు నుంచి కోయకుండా.. అంటే చెట్టు మీద నుంచి నేల మీద రాలి పడిన పువ్వులను ఉపయోగిస్తారు. అటువంటి పవిత్రమైన పారిజాత మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని జ్యోతిష్యం చెబుతోంది. ఈ మొక్క లక్ష్మీ దేవికి ప్రియమైనది.ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పారిజాతం మొక్క ఉండటం కూడా సానుకూల శక్తిని, ఆనందాన్ని తెస్తుందని భావిస్తారు.
Updated on: Apr 27, 2025 | 4:56 PM

శ్వాస కోశ సమస్యలు ఉన్న వారు పారిజాతం ఆకులు, పూల టీని చేసుకుని తేనె కలుపుకుని పరగడుపున రోజూ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని ఇది పలుచన చేసి బయటకు తోసి వేస్తుంది. అందువల్ల ఈ ఇబ్బందులన్నీ తగ్గుముఖం పడతాయి.

ప్రతి ఒక్కరూ జీవితం సుఖ సంతోషాలతో గడిపేందుకు డబ్బు సంపాదించడానికి కష్టపడి పని చేస్తారు. అయితే కొంతమంది ఎంత కష్టపడినా తగిన ఫలితం దక్కదు. మరోకొందరికి ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు నిలవవు. చేసే పనికి మంచి జీతం లభించినా నెలాఖరులో డబ్బులకు ఇబ్బంది పడేవారు చాలా మంది ఉన్నారు. నెలాఖరులో స్నేహితులు లేదా బంధువుల నుంచి ఆర్థిక సహాయం తీసుకోవలసి రావచ్చు. దీంతో అప్పుల పాలవుతాడు. సంపాదన కంటే ఖర్చు ఎక్కువగా ఉండి ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే జ్యోతిషశాస్త్రం కొన్ని పరిష్కారాలను సూచించింది.

ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరంలో పిత్త దోషం వల్ల అజీర్ణం సమస్య తలెత్తుతుంది. ఈ దోషాన్ని సరి చేయడంలో పారిజాత పుష్పం ఔషధంలా పని చేస్తుంది. పారిజాత పూల టీని క్రమం తప్పకుండా రోజూ తాగుతూ ఉండటం వల్ల స్త్రీ సంబంధమైన అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

పారిజాతం ఆకులను తేనె, అల్లంతో రోజుకి రెండుసార్లు తీసుకుంటే కాలేయ సమస్యల నుంచి బయటపడొచ్చు. పారిజాతం పూలు గుండె సమస్యల్ని కూడా పోగొడతాయి. పొడి దగ్గుతో బాధపడే వారు పారిజాతం ఆకులలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.

మోకాళ్ల నొప్పులు సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు పారిజాతం అద్భుతంగా పనిచేస్తుంది. ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు తగ్గడానికి పారిజాత పూల టీ లేదా ఆకుల టీ పనికి వస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది వాపులను సమర్థవంతంగా తగ్గిస్తుంది.

Parijata Flower

పారిజాత మొక్కను ఇంట్లో పెంచడం వలన అప్పు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వారు మీ అప్పుని తీరుస్తారు. అంతేకాదు మీరు అప్పు చేస్తే ఆ ఋణం తీర్చి రుణ విముక్తి పొందవచ్చు. పారిజాత మొక్కలోని ఒక ముక్కను తేసుకుని ఎర్రటి వస్త్రంలో కట్టి లక్ష్మీ దేవి ముందు ఉంచాలి. లక్ష్మీదేవిని పారిజాతం ముక్కని పసుపు, కుంకుమలతో పూజించండి. జ్యోతిష్యం ప్రకారం కనకధార స్తోత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వలన ఖచ్చితంగా ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం.




