ఏపీలో సీతమ్ము ప్రత్యేక ఆలయం ఉందని తెలుసా? వీడియో
భారతీయులకు శ్రీరాముడు ఆదర్శప్రాయుడు. సీతాదేవి ఆయన ధర్మపత్నిగా పూజలందుకుంటోంది. రాము మందిరాలు, రామాలయాల్లో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి పూజలందుకుంటూ కనిపిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో రామాలయం లేని వీధి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. రామాలయంలో ఆదర్శ దంపతులైన సీతారాములతో పాటు లక్ష్మణుడు, హనుమంతుడు కూడా భక్తులతో పూజలను అందుకుంటారు.
అయితే హనుమంతుడికి విడిగా ఆలయాలు కనిపిస్తాయి. కానీ ఒక్క సీతాదేవిని పూజించే ఆలయాలు మాత్రం ఉంటాయని భావించి ఉండరు కూడా. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా, ఉండిరాజవరం మండలం, వడ్లూరు గ్రామంలో బాల సీతాదేవికి ప్రత్యేకంగా విగ్రహం ఏర్పాటు చేసి దశాబ్దాలుగా పూజాదికాలు నిర్వహిస్తున్నారు. అయోధ్యలో బాలరాముడు పూజలందుకుంటున్నాడు. మరి అయ్యో నిజ అయిన సీతాదేవిని బాలిక రూపంలో కొలిచే ఆలయాన్ని కొన్ని దశాబ్దాలక్రితమే నిర్మించారు. పాలరాతితో నిర్మలంగా కనిపించే ఆ బాల సీతకు నిత్యం పూజాదికాలు నిర్వహిస్తారు. అంతేకాదు సీతాదేవి సంపదకు, త్యాగానికి, సహనానికి, ధైర్యానికి, నిర్మలత్వానికి ప్రతీక. ఆమెకు ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా, ఉండిరాజవరం మండలంలోని వడ్లూరులో వ్రతం ఆచరిస్తారు. సీతాదేవి పాదాలు స్పైతం ఇక్కడ ఉన్నాయని స్థానికులు చెబుతారు. ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షుడు వైస్ భార్య ఉష చిలకూరి పూర్వికులు ఈ ఆలయానికి స్థలం ఇచ్చారు.
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

