AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali: దీపావళి రోజు బాణాసంచా కాలుస్తున్నారా.. ఈ వ్యాధులున్నవారు బహుపరాక్..!

సాయంత్రం అయితే చాలు పిలల్లు పెద్దలు పటాకులు కాలుస్తూ సందడి చేస్తారు.  దీపావళి వేడుకల్లో క్రాకర్స్ పేల్చడం ఒక ప్రధాన సందడి. అయితే ఇలా బాణాసంచా కాల్చడం వల్ల షుగర్ పేషెంట్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

Diwali: దీపావళి రోజు బాణాసంచా కాలుస్తున్నారా.. ఈ వ్యాధులున్నవారు బహుపరాక్..!
Diwali Crackers
Surya Kala
|

Updated on: Oct 22, 2022 | 1:39 PM

Share

అమావాస్య రోజున వెలుగులను తీసుకొచ్చే పండగ దీపావళి. మన జీవితాల్లోని చీకటిని తొలగించి వెలుగువైపు పయనింపజేసే పండుగ. ఈ సంవత్సరం అక్టోబర్ 24 న దేశ వ్యాప్తంగా దీపావళిని జరుపుకోవడానికి ప్రజలు రెడీ అవుతున్నారు. తమ ఇళ్ళు దీపాలు, లైట్స్ తో అలంకరిస్తారు. దీపావళి పర్వదినం కొన్ని ప్రాంతాల్లో అది రోజుల పాటు.. అంటే అన్నా చెల్లెళ్ళ పండగ వరకూ జరుపుకుంటారు.    భారతదేశం యొక్క అతిపెద్ద పండుగ దీపావళి సందర్భంగా.. ప్రజలు తమ ఇంటిని అందంగా అలంకరిస్తారు. కొత్తబట్టలు ధరిస్తారు.  అంతేకాదు దీపావళి రోజున గణేశుడిని , లక్ష్మీ దేవిని పూజిస్తారు. సాయంత్రం అయితే చాలు పిలల్లు పెద్దలు పటాకులు కాలుస్తూ సందడి చేస్తారు.  దీపావళి వేడుకల్లో క్రాకర్స్ పేల్చడం ఒక ప్రధాన సందడి. అయితే ఇలా బాణాసంచా కాల్చడం వల్ల షుగర్ పేషెంట్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కనుక దీపావళి వేడుకను షుగర్ పేషేంట్స్ జరుపుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు తెలుసుకుందాం..

  1. షుగర్ సమస్యలు ఉన్నవారు లేదా డయాబెటిక్ పేషెంట్లు క్రాకర్లను కాల్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా రకమైన గాయం ఏర్పడితే అది సులభంగా నయం కాదు.
  2. ఆస్తమా రోగులు పొరపాటున కూడా క్రాకర్స్ పేల్చకూడదు. వాతావరణంలోని దుమ్ము, ధూళి, పొగ ఆస్తమా పేషేంట్స్ ను మరింత ఇబ్బందికి గురి చేస్తుంది. కనుక ఇంటిలో ఉండడం శ్రేయస్కరం.
  3. పటాకులు కాల్చేటప్పుడు.. ఆరుబయట ప్రాంతాన్ని ఎంచుకోండి. అంతేకాదు వదులుగా ఉండే కాటన్ బట్టలు ధరించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సింథటిక్ దుస్తులను ధరించవద్దు.
  4. మీరు హార్ట్ పేషెంట్ అయితే, దీపావళి సందర్భంగా మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సురక్షితంగా ఉండటానికి, పటాకులు పేల్చడం మానుకోండి. బాణాసంచాకు వీలైనంత దూరంగా కూర్చుని ఈ పండుగను ఫ్లేవర్ ను ఆస్వాదించండి.
  5. ఇవి కూడా చదవండి
  6. బాణసంచా కాల్చడం వల్ల కాలుష్యం స్థాయి పెరిగి ఒకొక్కసారి చర్మం వ్యాధుల బారినపడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో చర్మాన్ని తేమగా ఉంచడం చాలా ముఖ్యం. చర్మంపై కొబ్బరి నూనెను అప్లై చేసుకోవాలి. ఎక్కువ నీరు త్రాగాలి.
  7. పటాకుల నుండి వెలువడే పొగ,  వాయువు కళ్లలో మంట లేదా దురదను కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీ కళ్ళను మధ్యమధ్యలో నీటితో శుభ్రం చేసుకోండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)