Diwali Dry Fruits: దీపావళికి చేదు గుళిక.. మరింత కొండెక్కిన డ్రై ఫ్రూట్స్ ధరలు.. రీజన్ ఏమిటో తెలుసా..

మాములుగా అయితే తీయని వేడుక చేసుకుందాం.. అనేది ఒక చాక్లెట్ కంపెనీ యాడ్.. కానీ ఇప్పుడా మాటను.. ఈ దీవాలీకి డ్రై ఫ్రూట్ వేడుకను గ్రాండ్ గా చేస్కుందామని.. మార్చి రాసుకోవల్సి వస్తోంది..

Diwali Dry Fruits: దీపావళికి చేదు గుళిక.. మరింత కొండెక్కిన డ్రై ఫ్రూట్స్ ధరలు.. రీజన్ ఏమిటో తెలుసా..
Dry Fruits (File Photo)
Follow us

|

Updated on: Oct 22, 2022 | 1:40 PM

బాదం, జీడిపప్పు, క్రాన్బెర్రీస్, పిస్తా, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్, డ్రై బెర్రీస్ లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ లతో పాటు  యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. వీటిని క్రమం తప్పక తింటే.. పోషకాహారం లభిస్తుంది. దీంతో మన శరీరం కావల్సినంత శక్తిని పెంపొందించు కుంటుంది. మాములుగానే డ్రైఫ్రూట్స్ ధరలు చుక్కల్లో ఉంటాయ్.. ఈ దీపావళికి మరింత పైకెక్కాయి.. కారణం ఏమిటో తెలుసా..

ఒకప్పుడు దీపావళి పండగ రోజున శుభాకాంక్షలను స్వీట్స్ ఇచ్చి చెప్పుకునేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. లేటెస్ట్ ట్రెండ్ డ్రై ఫ్రూట్ గిఫ్ట్ ప్యాక్ గా ఇవ్వడం. దీపావ‌ళి నాడు కానుక‌గా ఈ డ్రైఫ్రూట్స్ ఫ్యాక్ అందించండి.. అంటూ ఆన్ లైన్ పోర్టల్స్ కొన్ని.. ఒక ఊపు ఊపుతున్నాయి. మాములుగా అయితే తీయని వేడుక చేసుకుందాం.. అనేది ఒక చాక్లెట్ కంపెనీ యాడ్.. కానీ ఇప్పుడా మాటను.. ఈ దీవాలీకి డ్రై ఫ్రూట్ వేడుకను గ్రాండ్ గా చేస్కుందామని.. మార్చి రాసుకోవల్సి వస్తోంది..

కార్పొరేట్ బహుమతుల్లో టాప్ ప్లేస్.. ఈ డ్రైఫ్రూట్స్ దే.. మరీ ముఖ్యంగా కోవిడ్ నైన్టీన్ తర్వాత.. హెల్దీ డైట్ ట్రెండ్ ఒకటి ప్రారంభమైంది. దీంతో డ్రై ఫ్రూట్స్, నట్స్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మాములుగా అయితే వింటర్ సీజన్ లో డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువ తినేవారు. ఈ టైంలోనే వీటి వినియోగం చాలా వరకూ ఉండేది. అయితే ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం.. సాధారణ రోజుల్లోనూ ఈ గింజలను ఆహారంగా తీసుకోవడం ఎక్కువగా పెరిగింది.

ఇవి కూడా చదవండి

సర్వసాధారణంగా ఈ మార్కెట్ చాలా వరకూ అసంఘటితమైనది. అయినా సరే ఈ మార్కెట్ ప్రస్తుత విలువను బట్టీ చూస్తే.. 2 బిలియన్ డాలర్ల వరకూ ఉంది. 2023లో ఇది పదిశాతం మేరే పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు మార్కెట్ ఎనలిస్టులు.

డ్రైఫ్రూట్స్ అండ్ నట్స్ లో జీడిపప్పు, బాదం ఎక్కువగా సేల్ అవుతాయి. పిస్తా పప్పులు, వాల్ నట్, ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, అత్తి పండ్లు కూడా ఈ విభాగం కిందకే వస్తాయి. అయితే ఇప్పుడు ఎండు ద్రాక్ష, ఖర్జూరాలకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. అసలీ డ్రైఫ్రూట్ విభాగంలోనే అత్యంత చిన్నదిగా భావించే ఎండు ద్రాక్ష ఏకంగా నలభై శాతానికి తన అమ్మకాలను పెంచుకుందంటే.. అర్ధం చేసుకోవచ్చు.

డేట్స్ అంటే ఖర్జూరం.. కూడా భారీ డిమాండ్ సొంతం చేసుకుంటోంది. ఒకప్పుడు రంజాన్ కాలంలో మాత్రమే ఎక్కువగా ఉండే.. డేట్స్ అమ్మకాలు.. యూపీ, బీహార్, దక్షిణ తమిళనాడు, కేరళలో మాత్రమ బలంగా ఉండే.. ఖర్జూరం సేల్స్.. ఇప్పుడు ఏడాది పొడువునా అన్ని ప్రాంతాలకు తన మార్కెట్ విస్తరణ చేసింది.

ఒక్క దీపావళి అనే కాదు.. జనం ఇప్పుడు ఆరోగ్యం, వ్యాయామం పై ఎక్కువ దృష్టి సారించారు. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ప్రొటీన్ శాతం పెరుగుతుంది. దీంతో వీటిని తినడం ఆరోగ్యదాయకంగా భావిస్తున్నారు. దానికి తోడు మనవాళ్లు జీడిపప్పును ఎక్కువగా తింటారు. దీంతో జీడిపప్పు వాడకం 2 నుంచి మూడు లక్షల టన్నులకు చేరింది. ఇక్కడి జీడిపప్పు సరిపోనందున.. ఆఫ్రికా, తూర్పు ఆసియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

ఈ మార్కెట్ ఇంత భారీ ఎత్తున పెరగడానికి గల కారణం.. కరోనా తర్వాత కార్పొరేట్ ఆఫీసులన్నీ దాదాపు తెరుచుకున్నాయి. వ్యాపార కార్యకలాపాలు సైతం ఊపందుకున్నాయి. దీంతో కార్పొరేట్ గిఫ్ట్ అంటే.. అది కేవలం గిఫ్ట్ ప్యాక్ లా ఉండకుండా.. విత్ హెల్త్ కాన్షస్ గా తన రూపు మార్చుకుంది. అయినా స్వీట్ తింటే ఏముంది? బాడీలో సుగర్ లెవల్స్ పెరగడం తప్ప. దానికి తోడు స్టాఫ్ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా? అన్న ధోరణిలోకి వచ్చేశాయి కార్పొరేట్ కంపెనీలు. దీంతో కార్పొరేట్ గిఫ్ట్ ప్యాకింగ్ అన్న కొత్త ట్రెండ్ ఒకటి వచ్చేసిందంటున్నారు ప్యాకింగ్ రంగ నిపుణులు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..