Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanskrit Speaking Village: ఆ గ్రామంలో అందరూ సంస్కృతంలోనే మాట్లాడుతారు.. ఎక్కడో తెలుసా?

అస్సాంలోని ఒక గ్రామాన్ని 'సంస్కృత గ్రామం' అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడి ప్రజలందరూ 2015 నుండి ఈ పురాతన,  సాంప్రదాయ భాషలోనే మాట్లాడుతున్నారు అవును కరీంగంజ్ జిల్లాలోని రతాబరీ అసెంబ్లీ నియోజకవర్గం పాటియాలా గ్రామంలో

Sanskrit Speaking Village: ఆ గ్రామంలో అందరూ సంస్కృతంలోనే మాట్లాడుతారు.. ఎక్కడో తెలుసా?
Sanskrit Village In Assam
Follow us
Surya Kala

|

Updated on: Oct 22, 2022 | 11:26 AM

భారత దేశం భిన్న సంస్కృతి సాంప్రదాయాలు అనేక భాషలు ఉన్న అతి పురాతన దేశం. మనదేశంలో అతిపురాతన భాష సంస్కృతం. ఆధునికత పేరుతో వచ్చిన మార్పుల్లో భాగంగా మన సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు.. సంస్కృత భాషను కూడా పక్కన పెట్టారు. ఇంకా చెప్పాలంటే.. అతి ప్రాచీన భాష అయిన సంస్కృతాన్ని మరచిపోయాం. అయితే మనం మరచిపోయిన ఈ భాష ప్రపంచ దేశాలను తనవైపుకు తిప్పుకుంది. అనేక దేశాలు సంస్కృత భాషను ఆదరిస్తున్నాయి. ఈ భాష విశిష్టతను గుర్తించిన అనేక దేశాలు నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించాయి. అయితే వివిధ భాషలు సంస్కృత మహావృక్షం నుంచి ఉద్భవించిన శాఖలేనని భాషావేత్తలు చెబుతుంటారు. ప్రస్తుతం సంస్కృతం వేదమంత్రాల రూపంలో వినిపించడమే తప్ప, ఓ వాడుక భాషగా ప్రాచుర్యంలో లేదనే చెప్పాలి.  ఈ నేపథ్యంలో ఈ శాన్య రాష్ట్రాల్లోని ఓ ఊరిలో సంస్కృత భాషా వినిపిస్తోంది. ఆ ఊరిలో ఏ ఇంటికి వెళ్లినా.. ఎవరిని పలకరించినా కాళిదాసు నోటినుంచి సంస్కృత భాష అసువుగా వచ్చినట్లు అక్కడి వారిని నోటినుంచి సంస్కృత భాషా సుగంధాలే విరజిమ్ముతాయి. ఒక్క ఇంగ్లీషు పదమైనా మచ్చుకైనా వినిపించదు.. సంస్కృత భాషా పరిమిళాన్ని పంచుతున్న ఆ గ్రామం ఎక్కడ ఉందొ వివరాల్లోకి వెళ్తే..

అస్సాంలోని ఒక గ్రామాన్ని ‘సంస్కృత గ్రామం’ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడి ప్రజలందరూ 2015 నుండి ఈ పురాతన,  సాంప్రదాయ భాషలోనే మాట్లాడుతున్నారు అవును కరీంగంజ్ జిల్లాలోని రతాబరీ అసెంబ్లీ నియోజకవర్గం పాటియాలా గ్రామంలో పిల్లలు, పెద్దలు అందరూ సంస్కృతంలోనే సంభాషించుకుంటారు. ఈ గ్రామంలో 60 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో దాదాపు 300 మంది ‘సంస్కృతం మాట్లాడతారు. అంతేకాదు ఈ గ్రామస్తులు రాబోయే తరాలు కూడా సంస్కృత భాషలోనే మాట్లాడేలా ప్రోత్సహించడం ద్వారా మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ రోజూ ‘యోగ శిబిరాలు’ కూడా నిర్వహిస్తారు.

ఈ గ్రామానికి చెందిన యోగా గురువు దీప్ నాథ్ మాట్లాడుతూ.. తాము 2013లో యోగా శిబిరాన్ని ప్రారంభించామని, ఆ తర్వాత సంస్కృత భారతి కార్యకర్తలు 2015లో గ్రామాన్ని సందర్శించారని చెప్పారు. అప్పుడు ఈ గ్రామంలో సంస్కృత భాషకు బీజం పడింది. అప్పటి నుంచి ఈ గ్రామంలోని ప్రజలు సంస్కృత భాషలోనే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అంతేకాదు తమ భావితరాలకు ఈ భాషను అందించడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నామని గ్రామ నివాసి దీప్ నాథ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

నిత్యం ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు యోగా శిబిరాలు నిర్వహిస్తామని, ఇక్కడ సంస్కృతంలోనే ప్రతి బోధన జరుగుతుందన్నారు. అంతేకాదు గ్రామంలో ప్రతి నెలా గాయత్రీ యాగాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ యాగంలో గ్రామంలోని ప్రతిఒక్కరూ పాల్గొంటారు అని ఆయన చెప్పారు. ఈ గ్రామస్థలు వ్యవసాయం జీవనాధారంగా బతుకుతున్నారు. కేవలం 15 మంది మాత్రమే ఉద్యోగం చేస్తున్నారని దీప్ నాథ్ తెలిపారు. ఈ గ్రామస్థులను చూసి.. ఇరుగుపొరుగు గ్రామస్థులు కూడా సంస్కృత భాషావైపు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే తమ పాట్యాలా గ్రామాన్ని చూసి పొరుగునే ఉన్న అనిపూర్ బస్తీ ప్రజలు కూడా సంస్కృత భాషలో మాట్లాడడం ప్రారంభించారని ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..