Horoscope Today: ఈరోజు ఈ రాశివారు అనవసర ఖర్చులు చేయాల్సి ఉంటుంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

ఈరోజు తమకు ఎలా ఉంటుంది.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 22 వ తేదీ ) శనివారం  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు అనవసర ఖర్చులు చేయాల్సి ఉంటుంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Oct 22, 2022 | 7:10 AM

Horoscope Today (22-10-2022):  రోజు మొదలైతే మనిషి ముందుగా ఆలోచించేది.. ఈరోజు తమకు ఎలా ఉంటుంది.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 22 వ తేదీ ) శనివారం  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ  రోజు ఈ రాశివారు అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. బంధు, మిత్రుల సహకారంతో కలిసి కొన్ని ప్రయత్నాలు పూర్తి చేస్తారు. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు తమ బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. శుభకాలం. వృత్తి, విద్య, వైద్య రంగాల్లోని వారు అనుకూల ఫలితాలను అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు తోటివారిని కలుపుకొనిపోవడం ఉత్తమం. ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. చేపట్టే పనిలో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. స్థిర నిర్ణయాలు శుభఫలితాలను అందిస్తాయి.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఇతరుల సహకారంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి మిశ్రమ కాలం. అధిక వ్యయం చేస్తారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తీ చేస్తారు.  సొంత నిర్ణయాలు పనిచేయవు. మంచి ఆలోచనావిధానంతో ముందుకు సాగండి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఖసందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలి. మంచి పనులు చేపడతారు. బంధుప్రీతి ఉంది.  కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. గొప్పవారితో  పరిచయాలు ఏర్పడతాయి.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు అవసరానికి డబ్బులు అందుకుంటారు. ఒక వ్యవహారంలో ఇతరుల  సాయం అందుకుంటారు.  సకాలంలో పనులను పూర్తిచేస్తారు. బంధు, మిత్రులను కలుపుకుని ముందుకు వెళ్తారు. అధిక ఒత్తిడిని జయిస్తారు. ప్రయాణాలు సుఖవంతం అవుతాయి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనులల్లో ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకోవాలి. లక్ష్యాలను చేరుకోవాలంటే కుటుంబ సభ్యుల మాటకు ఇవ్వాలి. చేపట్టిన పనుల్లో కీలక నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్తారు. ఉత్సాహంగా ముందుకు సాగాలి.  శత్రువులకు దూరంగా ఉండడం మేలు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. వృత్తి, విద్య, ఉద్యోగాల్లో ఆర్థికాభివృద్ధిని అందుకుంటారు. శుభవార్త వింటారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శుభవార్త వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు అభివృద్ధికి సంబంధించి ఇతరుల సహకారంతో ముందుకు వెళ్లారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కుటుంబసభ్యులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. బంధు, మిత్రుల సహకారంతో ఆయా రంగాల్లో అనుకూల ఫలితాలను అందుకుంటారు. మానసిక ధైర్యంతో ముందుకు వెళాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రతిభతో పనితీరుకు తగిన ప్రశంసలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో శుభఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైన పనుల విషయంలో ఆర్ధిక పురోగతి ఉంటుంది.

లక్ష్యం నెరవేరుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉండాలి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. శ్రమ అధికం అవుతుంది. దుర్గా ఆరాధన శుభప్రదం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)