AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేరేడు పండు పిల్లలకు, పెద్దలకు మస్తు మంచిది..! కానీ ఎంత తినాలో తెలుసా?

నేరేడు పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. పిల్లలు, పెద్దలు ఇష్టపడే ఈ పండు విటమిన్లు, ఖనిజాలతో నిండిపోయి ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఈ పండు బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపికగా నిలుస్తుంది. ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ పండును తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నేరేడు పండు పిల్లలకు, పెద్దలకు మస్తు మంచిది..! కానీ ఎంత తినాలో తెలుసా?
Jamun Health Benefits
Prashanthi V
|

Updated on: Apr 27, 2025 | 9:53 PM

Share

వేసవిలో నేరేడు పండు విస్తృతంగా లభిస్తుంది. ఈ కాలంలో దాహాన్ని తగ్గించడంలో శరీరాన్ని చల్లబరచడంలో నేరేడు మంచి పాత్రను పోషిస్తుంది. ఇది పేగు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో రక్తపోటును సమతుల్యంలో ఉంచడంలో కూడా ఇది సహకరిస్తుంది. ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో నేరేడు కీలక పాత్ర పోషిస్తుంది.

నేరేడు పండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాని దీనిని అధికంగా తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఇందులో ఫైబర్, టానిన్లు అధికంగా ఉంటాయి. ఎక్కువగా తినడం వల్ల పేగులపై ఒత్తిడి పెరిగి కడుపు నొప్పి, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొంతమందికి జీర్ణక్రియ సమస్యలు కలుగుతాయి. అందువల్ల మితంగా తినడం అవసరం.

నేరేడు విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. చర్మానికి మేలు చేయడంలో ఇది సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రకాశవంతంగా కనిపించడంలో ఇది ఉపయోగపడుతుంది. అయితే కొంతమందిలో మొటిమలు, చిన్న చర్మ రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఎక్కువగా తినకుండా జాగ్రత్తగా ఉండాలి.

నేరేడు పండులో ఉండే ఆమ్లత్వం దంతాలపై ఉన్న ఎనామిల్‌ను బలహీనపరుస్తుంది. దీని వల్ల దంతాలు నెమ్మదిగా బలహీనపడే ప్రమాదం ఉంది. ఇందులో ఆక్సలేట్‌లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కాల్షియంతో కలసి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల నేరేడు తినేటప్పుడు పరిమితిని పాటించాలి.

నేరేడు తిన్న వెంటనే నీరు తాగడం మంచిది కాదు. అలాగే పండు తినడానికి ముందు లేదా తిన్న వెంటనే పాలు తాగకూడదు. ఊరగాయలు వంటి కారమైన ఆహారాలతో కూడా ఈ పండును తీసుకోవడం మంచిది కాదు. ఇవి జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. సరైన పద్ధతిలో తీసుకుంటే మాత్రమే ఈ పండులోని మేలు పొందవచ్చు.

నేరేడు తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. అయితే అధికంగా తీసుకుంటే రక్తపోటు తగ్గడం, వికారం వంటి సమస్యలు కలుగుతాయి. అందువల్ల నిత్యం పరిమిత మోతాదులోనే తీసుకోవాలి.

ప్రతి రోజు 1 నుంచి 2 సార్లు మాత్రమే నేరేడు తీసుకోవడం మంచిది. పండిన పండ్లను మాత్రమే తినాలి. పచ్చి పండ్లు జీర్ణ సమస్యలు కలిగించే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు నేరేడు తిన్న తర్వాత నోటి పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలి. ఇలా చేస్తే ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.