ఆహారంలో భాగంగా తీసుకునే పాల పదార్థాల్లో పెరుగు కీలకమైంది. చాలా మందికి పెరుగుతో తిననిదే అసలు భోజనం పూర్తికాదు. పెరుగు శరీరానికి చలువ చేస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియకు పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు
TV9 Telugu
దీనిలో ఉండే ప్రోబయాటిక్స్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. పెరుగును ఉదయం పూట, మధ్యాహ్న భోజనంతో తీసుకోవచ్చు
TV9 Telugu
గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలతో బాధపడే వారికి పెరుగు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్ గ్యాస్ లక్షణాలను తగ్గించడమే కాకుండా గ్యాస్ తయారవ్వకుండా నిరోధిస్తుంది
TV9 Telugu
పెరుగులో అధికంగా ఉండే ప్రోబయోటిక్స్ వల్ల మలబద్దకం తగ్గుతుంది. తద్వారా ప్రేగుల్లో గ్యాస్ తయారవ్వకుండా ఉంటుంది. పెరుగును తీసుకోవడం వల్ల దీనిలో ఉండే సూక్ష్మజీవులు మంచి బ్యాక్టీరియాను కాపాడతాయి
TV9 Telugu
సంక్లిష్టమైన ఆహారాలను సులభంగా జీర్ణం చేయడంలో కూడా పెరుగు తోడ్పడుతుంది. పెరుగులోని ఎంజైమ్ లు ఆహారాన్ని వేగంగా, సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి
TV9 Telugu
ముఖ్యంగా ఈ ఎంజైమ్ లు లాక్టోస్ ను జీర్ణం చేయడంలో సహాయపడతాయి. లాక్టోస్ అసహనం ఉన్నవారు క్రమం తప్పకుండా పెరుగును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది
TV9 Telugu
పొట్టలో ఆమ్లాల వల్ల హైపర్ అసిడిటీ వస్తుంది. దీంతో ఛాతి, కడుపులో నొప్పి, మంట, వాంతులు, ఆకలి లేకపోవడం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. పెరుగు తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది
TV9 Telugu
అయితే కఫం, దగ్గు, జలుబు, అలర్జీ వంటి సమస్యలతో బాధపడేవారు శీతాకాలంలో రాత్రిళ్లు పెరుగు తీసుకోకపోవడమే మంచిది. అదేవిధంగా తీవ్రమైన లాక్టోస్ అసహనం ఉన్నవారు కూడా పెరుగును తినకపోవడమే ఉత్తమం