మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ తాగందే రోజు ప్రారంభం కాదు. అందుకే ఇదొక ఇంధనంలా మారిపోయింది
TV9 Telugu
సమయానికి అది పడకపోతే బండి ముందుకు కదలదుమరి. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి చేటు చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు
TV9 Telugu
ముఖ్యంగా శీతాకాలంలో ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ ఖాళీ కడుపుతో టీ తాగడం కడుపులో ఆమ్లం పెరుగుతుంది. ఇది గుండెల్లో మంట, బరువు తగ్గడం, ఆమ్లత్వానికి దారితీస్తుంది
TV9 Telugu
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం, కొన్నిసార్లు కడుపు నొప్పి కూడా వస్తుంది. అలాగే ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభించదు. దీని వల్ల రోజంతా బలహీనత, నీరసం వస్తుంది
TV9 Telugu
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అందులో ఉండే కెఫిన్ వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది
TV9 Telugu
టీలోని టానిన్లు కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తాయి. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. కీళ్ల నొప్పులను పెంచుతుంది. పైగా దీనివల్ల పళ్లపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోయి దంత సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది
TV9 Telugu
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. ఇది మానసిక స్థితిని మరింత దిగజార్చుతుంది. నిద్రను ప్రభావితం చేస్తుంది
TV9 Telugu
టీ అలవాటు యాంగ్జయిటీ వంటి మానసిక సమస్యలకూ దారితీస్తుంది. పాలలో ఉండే లాక్టోజన్ కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యల్ని మరింత జటిలం చేస్తుంది