AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Late Night Sleep: రాత్రి నిద్ర ఆలస్యం చేస్తున్నారా? ఐతే డేంజర్‌లో పడినట్లే!

రాత్రిపూట నిద్ర చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారని.. కనీసం 5 గంటలు కూడా నిద్రించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నిద్ర తగినంత లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందంటున్నారు. అంతేగాక, రక్తపోటు, గుండెకు సంబంధించిన తీవ్ర సమస్యలు మొదలవుతాయని హెచ్చరిస్తున్నారు.

Late Night Sleep: రాత్రి నిద్ర ఆలస్యం చేస్తున్నారా? ఐతే డేంజర్‌లో పడినట్లే!
Late Night Sleep
Rajashekher G
|

Updated on: Dec 31, 2025 | 1:37 PM

Share

ఇటీవల కాలంలో రాత్రిపూట సరైన సమయంలో నిద్రపోవడం అనేది ఎవరికీ సాధ్యం కావడం లేదు. నగరాల్లో ఉండేవారికి మాత్రం అది అసాధ్యమే అవుతుంది. ఉద్యోగులు షిఫ్టుల్లో తమ విధులు నిర్వహిస్తుండటంతో చాలా మంది సమాయానికి నిద్రపోయే పరిస్థితి లేదు. అవకాశం ఉన్న మరికొందరు మాత్రం టీవీలు, ఫోన్లకు అతుక్కుని తమ నిద్రకు దూరమవుతున్నారు. అయితే, తగినంత నిద్ర లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒక తాజా అధ్యయనం ప్రకారం.. వరుసగా 3 నుంచి 4 గంటల కంటే తక్కువ నిద్ర పోవడం వల్ల రక్తంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. నిద్రలేమి ప్రభావాలు వృద్ధులలోనే కాదు, ఆరోగ్యవంతులైన యువతలో కూడా కనిపిస్తాయి. అందుకే ఏ వయస్సు వారైనా తగినంత నిద్ర తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

యువతపై ప్రయోగం

నిద్రలేమి(Late Night Sleep)పై నిర్వహించిన ఓ అధ్యయనంలో 15 మంది ఆరోగ్యవంతులైన యువకులను ప్రయోగశాలలో పరీక్షించారు. ఈ యువకులకు 3 రోజులు 8.5 గంటల సరైన నిద్ర, మరో మూడు రోజులు 4.25 గంటల నిద్ర కల్పించారు. ఆ తర్వాత వారిని పరీక్షించారు. అయితే, 4 గంటలపాటు నిద్రించిన యువతలో పలు ఆరోగ్య సమస్యలను గుర్తించారు. రక్తపోటు పెరగడంతోపాటు గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలను పెంచినట్లు తేల్చారు.

నిద్ర ఆలస్యంతో ఆందోళన, నిరాశ

రాత్రి ఆలస్యంగా పడుకునే లేదా ఆలస్యంగా మేల్కునే వ్యక్తులకు ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఆలస్యంగా నిద్రపోయే వారి కంటే ఆలస్యంగా మేల్కునే వ్యక్తుల మానసిక ఆరోగ్యం గణనీయంగా దెబ్బతింటుందని తెలిపింది.

వైద్యులు ఏం సూచిస్తున్నారు?

రాత్రిపూట త్వరగా భోజనం పూర్తి చేసి నిద్రకు ఉపక్రమించడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట తేలికపాటి భోజనం చేయాలని, చీకటి గదిలో నిద్రించాలని సూచిస్తున్నారు. తల, పాదాలను మసాజ్ చేసుకోవడం ద్వారా నిద్ర త్వరగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది మీ శరీరానికి విశ్రాంతిని ఇస్తుందని అంటున్నారు. పడుకుముందే గోరువెచ్చని పాలలో తేనె లేదా పసుపు కలుపుకుని తాగడం వల్ల నిద్ర బాగా పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేగాక, పడుకునే ముందు ఫోన్లు, టీవీలను చూడకుండా, వాటికి దూరంగా ఉంటే మంచి నిద్రకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Late Night Sleep: రాత్రి నిద్ర ఆలస్యం చేస్తున్నారా? ఐతే డేంజర్‌
Late Night Sleep: రాత్రి నిద్ర ఆలస్యం చేస్తున్నారా? ఐతే డేంజర్‌
స్మార్ట్ టీవీ హ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఈ 5 ప్రమాదకరమైన సంకేతాలు
స్మార్ట్ టీవీ హ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఈ 5 ప్రమాదకరమైన సంకేతాలు
ఒరిస్సా తీసుకున్న నిర్ణయంతో భగ్గుమంటున్న కొటియా గ్రామాల ప్రజలు
ఒరిస్సా తీసుకున్న నిర్ణయంతో భగ్గుమంటున్న కొటియా గ్రామాల ప్రజలు
Video: క్రికెట్‌ హిస్టరీలో కొత్త షాట్.. ఏకంగా స్టాండ్ మార్చుకుని
Video: క్రికెట్‌ హిస్టరీలో కొత్త షాట్.. ఏకంగా స్టాండ్ మార్చుకుని
టాటా సుమో మళ్లీ తిరిగి వస్తుందా? నెట్టింట్లో కారు డిజైన్లు!
టాటా సుమో మళ్లీ తిరిగి వస్తుందా? నెట్టింట్లో కారు డిజైన్లు!
బాక్సాఫీస్ దగ్గర మెరిసిన స్టార్స్.. 2025లో ఊపిరిపోసిన హిట్స్‌
బాక్సాఫీస్ దగ్గర మెరిసిన స్టార్స్.. 2025లో ఊపిరిపోసిన హిట్స్‌
న్యూ ఇయర్‌ వేడుకలకు ఇబ్బందులు తప్పవా?
న్యూ ఇయర్‌ వేడుకలకు ఇబ్బందులు తప్పవా?
అంతవరకు కోలాహలం, ఆనందం.. అంతలోనే ఊహకందని విషాదం..
అంతవరకు కోలాహలం, ఆనందం.. అంతలోనే ఊహకందని విషాదం..
టీ20 ప్రపంచకప్‌నకు 3 జట్ల స్వ్కాడ్స్ ఫిక్స్.. డేంజరస్ టీం ఏందంటే?
టీ20 ప్రపంచకప్‌నకు 3 జట్ల స్వ్కాడ్స్ ఫిక్స్.. డేంజరస్ టీం ఏందంటే?
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన వ్యక్తి.. ఆపి చెక్‌ చేయగా..
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన వ్యక్తి.. ఆపి చెక్‌ చేయగా..