నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాదీలకు గుడ్ న్యూస్. డిసెంబర్ 31న (బుధవారం) హైదరాబాద్ మెట్రో రైలు సేవలను ఎల్అండ్టి హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అర్ధరాత్రి 1 గంట వరకు పొడిగించింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు నడిచే మెట్రో, ఈసారి ప్రారంభ స్టేషన్ల నుండి రాత్రి 1 గంటకు బయలుదేరుతుంది.