షుగర్‌ రోగులు చిలగడ దుంప తినొచ్చా?

30 December 2025

TV9 Telugu

TV9 Telugu

చిలగడ దుంపల గురించి తెలియని వారుండరు. ఇందులోని పోషకాలు ఎన్నో విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే డయాబెటిక్‌ రోగులు వీటిని తినకూడదని దూరం పెడుతుంటారు

TV9 Telugu

నిజానికి వీటిలోని గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ (జీఐ), పీచు పదార్థం షుగర్‌ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. కేవలం స్వీట్‌ పొటాలో అని దీని పేరులో తీపి ఉండటం వల్లే మధుమేహ బాధితులు వీటిని చాలాకాలంగా పక్కన పెట్టేశారు

TV9 Telugu

చిలగడదుంపలోని పిండి పదార్థం రక్తంలో కలిసే విధానం తెలిస్తే.. అపోహలు విడిచి ఆహారంలో తప్పక తీసుకుంటారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

TV9 Telugu

గ్లెసెమిక్‌ ఇండెక్స్‌ సేల్‌పై చిలగడదుంపల స్థానం చాలా తక్కువ. పొట్టుతో సహా వండిన చిలగడదుంపల జీఐ కేవలం 44 నుంచి 61 మధ్యలో ఉంటుంది. అందువల్ల మధుమేహ బాధితులు వీటిని హాయిగా తినొచ్చు

TV9 Telugu

చిలగడదుంపను మీరు ఎలా వండుతున్నారనే దానిపైనే అది మీ చకెర స్థాయులను ఎంత పెంచుతుందనేది ఆధారపడి ఉంటుంది. ఇందులోని పీచు జీర్ణక్రియకు భద్రతా వలయంలా పనిచేస్తూ రక్తంలో చక్కెర స్థాయులను అదుపు చేస్తుంది

TV9 Telugu

వేయించడం, ఉడకబెట్టడం, గుజ్జు చేయడం వల్ల దాని గుణం మారుతుంది. వండే శైలిని బట్టే రక్తంలోకి చేరే గ్లూకోజ్‌ వేగం మారుతుంది

TV9 Telugu

ఇందులో బీటా-కెరోటిన్‌, విటమిన్‌ సి, పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు దండిగా ఉంటాయి. ఇందులోని విటమిన్‌-ఎ కంటి సమస్యలను నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది

TV9 Telugu

ఎంత రుచికరమైన ఆహారమైనా అతిగా తినడం మంచిదికాదు. చిలగడదుంపలు రోజుకు సుమారు 150 గ్రాములకు మించితీసుకోకూడదు. నేరుగా కాకుండా పప్పులు, మాంసం వంటి కూరగాయలతో తీసుకోవడం మంచిది