గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గుడ్లు తోడ్పడతాయి. గుండె ఆరోగ్యానికి గుడ్లు మంచివే అయినప్పటికీ వీటిని అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ
TV9 Telugu
కోడిగుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కోడిగుడ్డులో దాదాపు 180 నుండి 300 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ముఖ్యంగా పచ్చసొనలోనే అధికంగా ఉంటుంది
TV9 Telugu
గుడ్డు తెల్లసొనలో కొలెస్ట్రాల్ ఉండదు. గుడ్డు గుండె ఆరోగ్యానికి మేలు చేసేదే ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది
TV9 Telugu
గుడ్డును చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్, శుద్ది చేసిన ఆహారాలతో తింటే గుండెకు మేలు జరగడం పోయి గుండె జబ్బులు, అధిక బరువు, మధుమేహం, కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు పెరిగి లేనిపోని చిక్కుల్లో పడతారు
TV9 Telugu
గుడ్డులో దాదాపు 180 నుండి 300 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి వారానికి 3 నుండి 4 గుడ్లు తీసుకుంటే సరిపోతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు