AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: డోర్ ఓపెన్ చేసి ఉండటంతో లిఫ్ట్ వచ్చిందేమో అని కాలు పెట్టింది.. అంతే..

రంగారెడ్డి జిల్లాలో అపార్ట్‌మెంట్ లిఫ్ట్ నిర్లక్ష్యం ప్రాణం తీసింది. లిఫ్ట్ డోర్ ఓపెన్‌గా ఉండటంతో లిఫ్ట్ వచ్చిందని భావించి అడుగు వేసిన 60 ఏళ్ల మహిళ లిఫ్ట్ గుంతలో పడిపోయి మృతి చెందింది. మెయింటెనెన్స్ లోపాలు, సెన్సార్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు.

Hyderabad: డోర్ ఓపెన్ చేసి ఉండటంతో లిఫ్ట్ వచ్చిందేమో అని కాలు పెట్టింది.. అంతే..
Lift Accident
Sravan Kumar B
| Edited By: |

Updated on: Dec 31, 2025 | 1:12 PM

Share

శుభకార్యానికి వచ్చి ఆనందంగా తిరుగు ప్రయాణం ప్రారంభించిన ఓ కుటుంబాన్ని క్షణాల్లో విషాదంలోకి నెట్టేసింది అపార్ట్‌మెంట్ లిఫ్ట్ నిర్లక్ష్యం. లిఫ్ట్ డోర్ ఓపెన్‌గా ఉండటంతో లిఫ్ట్ వచ్చిందనుకుని అడుగు వేసిన 60 ఏళ్ల మహిళ కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీ సమీపంలోని మూన్ రాక్ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. షామీర్‌పేట్‌కు చెందిన లక్ష్మమ్మ (60) తన కుమారుడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై, కార్యక్రమం ముగించుకుని భర్త లింగయ్యతో కలిసి ఇంటికి బయలుదేరింది. అపార్ట్‌మెంట్ లిఫ్ట్ వద్దకు చేరుకున్న సమయంలో లిఫ్ట్ డోర్ ఓపెన్‌గా కనిపించడంతో లిఫ్ట్ వచ్చిందని భావించిన లక్ష్మమ్మ అడుగు ముందుకు వేసింది. అంతే… లిఫ్ట్ గుంతలోకి జారి పడిపోయి అక్కడికక్కడే తీవ్రంగా గాయపడి మృతి చెందింది. భార్య కళ్లముందే కుప్పకూలిపోవడంతో భర్త లింగయ్య బోరున విలపించాడు. అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే లక్ష్మమ్మను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శుభకార్యం జరిగిన కుటుంబం ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో లిఫ్ట్‌కు సరైన మెయింటెనెన్స్ లేకపోవడం, సెన్సార్ వ్యవస్థలు పనిచేయకపోవడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా తేలాయి. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్‌మెంట్ నిర్వహణ సంఘం, లిఫ్ట్ మెయింటెనెన్స్ ఏజెన్సీల పాత్రపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. లోపభూయిష్టులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరంలో అపార్ట్‌మెంట్‌లలో లిఫ్ట్ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. సరైన సర్వీస్‌లు లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఇందుకు కారణమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రెగ్యులర్ లిఫ్ట్ మెయింటెనెన్స్ తప్పనిసరి అని మరోసారి గుర్తు చేస్తున్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం.. ఒక కుటుంబానికి జీవితాంతం మిగిలే గాయం అయ్యింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నష్టాలు, నమ్మకద్రోహాలు.. కాలసర్ప దోషంతో ఈ రాశులు జాగ్రత్త!
నష్టాలు, నమ్మకద్రోహాలు.. కాలసర్ప దోషంతో ఈ రాశులు జాగ్రత్త!
మీరు ఒక గంట పాటు మీ మొబైల్ లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
మీరు ఒక గంట పాటు మీ మొబైల్ లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
కళ్లు లేకుండా పుట్టిన శిశువు.. ఆస్పత్రికి రూ. 1 కోటి ఫైన్!
కళ్లు లేకుండా పుట్టిన శిశువు.. ఆస్పత్రికి రూ. 1 కోటి ఫైన్!
ముంబై, లక్నో దారిలోనే మరో 4 జట్లు.. లిస్ట్‌లో ఆ టీంపేరు?
ముంబై, లక్నో దారిలోనే మరో 4 జట్లు.. లిస్ట్‌లో ఆ టీంపేరు?
OTTని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTTని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ 2026 విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ 2026 విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
బావులన్నీ గుండ్రంగానే ఎందుకు.. తాతల కాలం నాటి అసలైన ప్లాన్ ఇది!
బావులన్నీ గుండ్రంగానే ఎందుకు.. తాతల కాలం నాటి అసలైన ప్లాన్ ఇది!
బైక్‌లలో డీజిల్‌ ఎందుకు ఉపయోగించరు.. ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే
బైక్‌లలో డీజిల్‌ ఎందుకు ఉపయోగించరు.. ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే
బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి
బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి
ఈ రాశులకు విపరీత రాజయోగం..ఉద్యోగ పదోన్నతులు పక్కా..!
ఈ రాశులకు విపరీత రాజయోగం..ఉద్యోగ పదోన్నతులు పక్కా..!