నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడితే ఆరు నెలల జైలు, జరిమానాతో పాటు వాహన యజమానులకూ శిక్ష పడే అవకాశం ఉంది. సీపీ సజ్జనార్ క్యాబ్‌లు బుక్ చేసుకోవాలని సూచించారు. డీజే సౌండ్, మహిళల భద్రతపైనా షీ టీమ్స్ కఠినంగా వ్యవహరిస్తాయి.