వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి రథంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భారీగా భక్తులు తరలిరావడంతో కొండపై రద్దీ నెలకొంది. భక్తుల వసతికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.