ఏడాదిన్నర వయసున్న బన్నూరు జాతి పొట్టేలు ధర రూ.45 వేలు పలుకుతోంది. కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన ఈ జాతి గొర్రెలను ప్రస్తుతం పుంగనూరులోనూ పెంచుతున్నారు. రుచికరమైన మాంసం, నాణ్యమైన ఉన్ని ఉత్పత్తితో ఈ పొట్టేళ్లు పెంపకందారులకు లాభదాయకంగా మారాయి. పొడవైన చెవులు, ఉన్నితో ఇవి చూపరులను ఆకర్షిస్తున్నాయి.