హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
సైనిక సరుకు రవాణా విమానాలైన సీ-130జే సూపర్ విమానాల తయారీకి హైదరాబాద్ అడ్డాగా మారనుంది. ఈ విమానాలు త్వరలోనే హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో తయారయ్యే అవకాశం ఉంది. తన అవసరాల కోసం 80 సరుకు రవాణా విమానాలను కొనుగోలు చేయాలని భారత వాయుసేన భావిస్తోంది. దీంతో సీ-130జే సూపర్ విమానాల తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ తన విమానాలను విక్రయించేందుకు ఐఏఎఫ్‌తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవేళ సీ-130జే సూపర్ హెర్య్కులస్ విమానాలను కొనుగోలు చేయాలని ఐఏఎఫ్ నిర్ణయిస్తే.. వాటిని హైదరాబాద్‌లోనే తయారు చేయనున్నారు.
హైదరాబాద్‌లోని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ లో ఇప్పటికే ఈ విమానాల తోక భాగాలను తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. ఇటీవలే 250వ యూనిట్‌ను టీఎల్‌ఎంఏఎల్ నుంచి అమెరికాకు పంపారు. సీ-130జే విమానాలను ఇప్పటివరకు అమెరికాలోని మారీటా యూనిట్‌లో మాత్రమే లాక్‌హీడ్ మార్టిన్ పూర్తిస్థాయిలో తయారుచేస్తోంది. ఒకవేళ ఐఏఎఫ్‌తో ఒప్పందం ఖరారైతే ఆ విమానాల తయారీ కోసం భారత్‌లో ప్రత్యేకంగా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే తమకు హైదరాబాద్‌లో టీఎల్‌ఎంఏఎల్ ఉన్నందున.. అందులోనే ఈ భారీ విమానాలను తయారు చేస్తారని లాక్‌హీడ్ మార్టిన్ వర్గాలు తెలిపాయి.
మరిన్ని వీడియోల కోసం :
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
వైరల్ వీడియోలు
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో
వీడిని అసలు మనిషంటారా..వీడియో
పిల్లలకు పచ్చి క్యాబేజ్ తినిపిస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
