కన్నకొడుకునే దారుణంగా హత్య చేసిన తండ్రి వీడియో
ఖమ్మం జిల్లాలో దారుణ హత్య జరిగింది. తండ్రి కొడుకుని కిరాతకంగా చంపాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాశేం ఉదల అనే వ్యక్తిని తండ్రి మొండయ్య రోకలి బండతో తలపై బలంగా కొట్టాడు. రక్తపు మడుగులో పడిన కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు.
రెండు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన వేరొక కుటుంబ పంచాయితీ విషయంలో తండ్రి కొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సోమవారం కొడుకు వోడేల పెళ్లి రోజు కావడంతో సాయంత్రం తండ్రి కోసం మద్యం తీసుకుని వెళ్ళాడు. ఆ పంచాయితీ వద్ద జరిగిన గొడవకు తండ్రి క్షమాపణ కోరాడు. కానీ కనికరించని తండ్రి మొండయ్య కిరాతకంగా ప్రవర్తించాడు. ఇంటిముందు వరండాలో నిద్రిస్తున్న కొడుకుపై రోకలి బండతో దాడి చేసి హతమార్చాడు. రక్తపు మడుగులో పడివున్న కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం తండ్రి మొండయ్య పరారీలో ఉన్నాడు.
వైరల్ వీడియోలు
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
