లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే వీడియో
గురువును దైవంగా పూజించడం మన సంప్రదాయం. విద్యనీర్పే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానమని చెబుతారు. అయితే ప్రస్తుత కాలంలో గురువుల పట్ల విద్యార్థులకు పూజ్యభావం గౌరవం అనేవి కరువైపోతున్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఓ విద్యార్థిని చదువు చెప్పే లెక్చరర్ ను చెప్పుతో కొట్టింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. గురు శిష్య సంబంధానికే మాయని మచ్చ తెచ్చేలా ఓ దారుణ ఘటన ఏపీలో వెలుగులోకి వచ్చింది. తన సెల్ ఫోన్ తీసుకున్నారన్న కోపంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఏకంగా లెక్చరర్ పైనే చెప్పుతో దాడికి పాల్పడింది. ఈ ఘటన విశాఖపట్నం విజయనగరం జాతీయ రహదారి సమీపంలోని దాకమ్మరి వద్దగల రఘు ఇంజినీరింగ్ కళాశాలలో ఇటీవల చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
సదరు కళాశాలలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని క్యాంపస్ ప్రాంగణంలో సెల్ ఫోన్ వాడుతుండగా లెక్చరర్ గమనించారు. నిబంధనల ప్రకారం లెక్చరర్ ఆ విద్యార్థిని నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర ఆగ్రహానికి లోనైంది. విచక్షణ కోల్పోయి లెక్చరర్ ను అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా తన కాళ్ళకి ఉన్న చెప్పును తీసి లెక్చరర్ పై దాడికి దిగడం అక్కడున్న వారందరినీ షాక్ కు గురిచేసింది. ఈ అనుహ్య పరిణామంతో అక్కడే ఉన్న తోటి విద్యార్థులు వెంటనే స్పందించి దాడి చేస్తున్న విద్యార్థులని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా లెక్చరర్ పై దాడిని కొనసాగించింది. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో విద్యార్థి తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
