Viral Video: ఓరెయ్, ఎవర్రా నువ్వు.. లైక్స్ కోసం ఇంతలా.. వీడియో చూస్తే గుండె గజ్జుమనాల్సిందే..!
Trending Video: సోషల్ మీడియా యుగంలో ఫేమస్ అవ్వడానికి కొందరు ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి టవర్ పైభాగాన అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉండి చేసిన స్టంట్ నెటిజన్లను భయాందోళనకు గురిచేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైలరవుతోంది.

Viral Video: వైరల్ అవ్వాలనే పిచ్చితో కొందరు యువకులు చేసే పనులు చూస్తుంటే ఆశ్చర్యం కంటే భయమే ఎక్కువగా కలుగుతుంది. ఒక ఎత్తైన టవర్ పైన, ఎటువంటి రక్షణ కవచం లేకుండా ఒక వ్యక్తి చేసిన విన్యాసం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. కేవలం వ్యూస్ కోసం ఇంతటి సాహసం అవసరమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మృత్యువుతో ముద్దు.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు ఒక ఎత్తైన టవర్ లేదా బిల్డింగ్ పైభాగాన చివరన ఉన్న ఇనుప రాడ్డును పట్టుకుని వేలాడుతున్నాడు. అది ఎంత ఎత్తులో ఉందంటే, అక్కడి నుంచి కిందకు చూస్తే గుండె జారినంత పని అవుతుంది. కానీ ఆ యువకుడు మాత్రం ఎంతో ప్రశాంతంగా, తన ప్రాణాలకు ఏమీ కాదన్న ధీమాతో ఆ రాడ్డుపై రకరకాల ఫీట్లు చేస్తున్నాడు.
జంగ్ పట్టిన రాడ్డుపై ప్రమాదకరంగా..
వీడియోను నిశితంగా గమనిస్తే, ఆ యువకుడు పట్టుకున్న ఇనుప రాడ్డు కూడా తుప్పు పట్టి కనిపిస్తోంది. ఒకవేళ ఆ రాడ్డు విరిగిపోయినా లేదా అతని పట్టు తప్పినా, నేరుగా యమధర్మరాజు వద్దకు వెళ్లడం పక్కా. అతని వెనుక ఉన్న స్నేహితులు ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధిస్తూ నవ్వుతుండటం చూస్తుంటే, వారు దీనిని ఎంత తేలికగా తీసుకున్నారో అర్థమవుతుంది.
నెటిజన్ల ఆగ్రహం..
View this post on Instagram
ఈ వీడియోపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. “ఇది సాహసం కాదు, మూర్ఖత్వం” అని కొందరు కామెంట్ చేస్తుంటే, “లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టకండి” అని మరికొందరు హితవు పలుకుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన పనులను ప్రోత్సహించకూడదని, ఇలాంటి వీడియోలను తొలగించాలని టెక్ దిగ్గజాలను కోరుతున్నారు.
హెచ్చరిక: ఇలాంటి స్టంట్లు ప్రొఫెషనల్స్ పర్యవేక్షణలో, సరైన రక్షణ పరికరాలతో మాత్రమే చేయాలి. సరైన శిక్షణ లేకుండా ఇతరులను చూసి ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రాణాపాయానికి దారితీస్తుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కంటే ప్రాణం విలువైనదని గుర్తించాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




