AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోగిని చితక్కొట్టిన డాక్టర్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు చేసిన దాడికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. బెడ్ పై పడుకున్న ఓ రోగిని వైద్యుడు చితకబాదాడు. పేషెంట్ కూడా ఎదురుదాడికి ప్రయత్నించాడు. కానీ, వైద్యుడు మరింత రెచ్చిపోయి అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. అక్కడున్నవారు ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. వీడియో వైరల్ కావడంతో సదరు వైద్యుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

Viral Video: రోగిని చితక్కొట్టిన డాక్టర్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Doctor Assults Patient
Rajashekher G
|

Updated on: Dec 31, 2025 | 2:14 PM

Share

స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం పెరిగిపోవడంతో ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా అందరికీ ఇట్టే ఇట్టే చేరిపోతోంది. సాధారణంగా వింతలు, మనుషులను తీవ్ర ప్రభావం చేసే సంఘటనలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని వైద్యుడు చితకబాదడం ఆ వీడియోలో కనిపిస్తోంది.

రోగిని చితక్కొట్టిన డాక్టర్

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం షిమ్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ వైద్యుడు రోగిపై దాడి చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఆస్పత్రి బెడ్‌పై పడుకున్న రోగిపై ఓ వైద్యుడు చేయి చేసుకున్నాడు. దీంతో ఆ రోగి కూడా వైద్యుడిని తన్నడం మొదలు పెట్టాడు. దీంతో తీవ్ర కోపోద్రుక్తుడైన వైద్యుడు.. మరింతగా రెచ్చిపోయి దాడి చేశాడు. కొందరు ఆపేందుకు ప్రయత్నించినా వైద్యుడు రోగిని చితకబాదాడు. ఈ వీడియో అక్కడున్నవారు వీడియో తీసి నెట్‌లో పెట్టడంతో వైరల్ అయ్యింది.

దీంతో వైద్యుడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగుల పట్ల వైద్యుడి ప్రవర్తన సరిగా లేదని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు. అతడ్ని సస్పెండ్ చేశారు. దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తాను గౌరవంగా మాట్లాడమని చెప్పినందుకే ఆగ్రహించిన వైద్యుడు తనపై తీవ్రంగా దాడి చేసి గాయపర్చాడని బాధిత రోగి వాపోయాడు.

Follow Us
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
ఖడ్గంసినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఖడ్గంసినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఈ యాప్ ద్వారానే..
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఈ యాప్ ద్వారానే..
అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా ముగ్గురు మృతి
అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా ముగ్గురు మృతి
ప్రాణాలు తీస్తున్న ఫోన్లు.. ప్రణవి విషయంలో ఏం జరిగింది?
ప్రాణాలు తీస్తున్న ఫోన్లు.. ప్రణవి విషయంలో ఏం జరిగింది?