టేకాఫ్ సమయంలో విమానంలో చెలరేగిన మంటలు వీడియో
అమెరికాలోని ఒర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సకాలంలో స్పందించి విమానంలోని ప్రయాణికులను అత్యవసర స్లైడ్ల సాయంతో బయటకు తరలించారు. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 294 మంది ఉన్నారు. వారంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది, ఇద్దరు పైలెట్లతో డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్ 1213 సోమవారం మధ్యాహ్నం 11:15 సమయంలో ఒర్లాండో ఎయిర్ పోర్ట్ నుంచి హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది.
విమానం టేకాఫ్ కోసం రన్ వే పై సిద్ధంగా ఉండగా, విమానం ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ స్లైడ్స్ నుంచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ లైన్ తమ ప్రయాణికులు తమకు ఎంతగానో సహకరించారని, ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నామని చెప్పారు. అంతేకాదు ప్రయాణికులకు ఎదురైన ఈ అనుభవానికి క్షమాపణలు కోరుతున్నామని ఎయిర్ లైన్ తెలిపింది. ప్రయాణికుల భద్రతకంటే తమకు మరేమీ ముఖ్యం కాదని డెల్టా బృందాలు తమ కస్టమర్లను వీలైనంత త్వరగా వారి తుది గమ్యస్థానానికి చేరుస్తామని వెల్లడించింది. డెల్టా ఇతర విమానాల్లోని ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు తీసుకు వెళుతుందని ప్రకటించింది. అయితే నిర్వహణ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న విమానాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు మొదలుపెట్టింది.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
