AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటన్‌లో మిరాకిల్.. రెండు సార్లు జన్మించిన పిల్లాడు వీడియో

బ్రిటన్‌లో మిరాకిల్.. రెండు సార్లు జన్మించిన పిల్లాడు వీడియో

Samatha J

|

Updated on: Apr 27, 2025 | 3:09 PM

సృష్టిలో ఏ జీవికైనా పుట్టుక, మరణం అనేది ఒక్కసారే ఉంటుంది. కానీ బ్రిటన్ లో మాత్రం ఓ మిరాకిల్ సంఘటన చోటుచేసుకుంది. ఓ పిల్లవాడు రెండుసార్లు జన్మించడమే ఆ మిరాకిల్. ఎస్ మీరు వింటున్నది నిజమే. రాఫెట్టి ఇసాక్ అనే పిల్లవాడు సాంకేతికంగా రెండుసార్లు జన్మించాడు. పిల్లవాడు రెండుసార్లు జన్మించడం వెనుక ఓ కారణం కూడా ఉంది. ఆ పిల్లడి తల్లికి క్యాన్సర్ కణతులు పెరిగి, క్యాన్సర్ రెండో స్టేజికి చేరుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేశారు వైద్యులు. అప్పటికి పిల్లవాడు 20 వారాల వయసులో గర్భస్థ పిండంగా కడుపులోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో డాక్టర్ సాల్మని మజీద్ తన 15 మంది వైద్య బృందంతో కలిసి చాలా సంక్లిష్టమైన ఆపరేషన్ చేసి అటు తల్లిని ఇటు గర్భస్థ శిశువును కాపాడారు.

బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల లూసీ ఇసాక్ ఉపాధ్యాయురాలు. గర్భిణీ కావడంతో సాధారణ అల్ట్రా సౌండ్ పరీక్షలో క్యాన్సర్ బారిన పడ్డట్టు తెలిసింది. గర్భంతో ఉన్న కారణంగా కీహోల్ తరహాలో ఆపరేషన్ అసాధ్యం. అలాగని గర్భాన్ని తొలగించలేని పరిస్థితి. దాంతో పిండాన్ని ప్రసవం తరహాలో అలాగే బయటకు తీసుకొచ్చి బయట క్షేమంగా పక్కనే పెట్టి తల్లికి ఆపరేషన్ చేయాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడువుగా జాన్ రాడ్ క్లిఫ్ ఆసుపత్రిలో వైద్యుల బృందం రంగంలోకి దిగి గర్భస్థ పిండాన్ని బయటకు తీశారు. తల్లి శరీరంతో అనుసంధానమైన రక్తనాళాలు కనజాలం ముట్టుకోలేదు. వెచ్చగా పొత్తి కడుపులాంటి వాతావరణం కోసం సాలీన్ బ్యాగ్ లో పెట్టారు. దాదాపు ఐదు గంటల పాటు ఆపరేషన్ పూర్తి చేసి గర్భాశయాన్ని మళ్ళీ తల్లి పొత్తి కడుపులో పెట్టి కుట్లేయడంతో ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈ ఏడాది జనవరిలో నిండు గర్భిణిగా మళ్ళీ ఆసుపత్రికి వచ్చిన లూసీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇలా రెండుసార్లు పుట్టిన పిల్లవాడిగా రాఫెట్టి అరుదైన ఘనత సాధించాడు. ఆపరేషన్ చేసిన వైద్యుడు సాల్మని మజీద్ ను పిల్లవాడి తల్లిదండ్రులు ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు.