ఏఐతో నిరుద్యోగ సునామీ..వారి కామెంట్స్ వైరల్ వీడియో
ఇప్పుడంతా ఏఐ యుగం నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా శాస్త్ర సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విద్య, ఆరోగ్యం, వ్యాపార, వినియోగదారుల సేవా రంగాల్లో ఇప్పటికే ఏఐ పాతుకుపోయింది. ఏఐ రాకతో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వేగంగా పనులు పూర్తవుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ భద్రతపై ఆందోళన నెలకొంది. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఇదే రకమైన ఆందోళన వ్యక్తపరిచారు. ఏఐతో భవిష్యత్తులో కోట్లాది మంది ఉద్యోగాలకు ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. ఫలితంగా నిరుద్యోగం భారీగా పెరిగే ఛాన్స్ లేకపోలేదన్నారు. ఇప్పటివరకు గొప్ప గొప్ప డాక్టర్లు, టీచర్ల మేధస్సు అద్భుతమని మెచ్చుకున్నాం. ఏ
ఏఐ రాకతో రాబోయే దశాబ్ద కాలంలో వీరికి ఉండే జ్ఞానం ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మన జనాభాకు సరిపడా వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల కొరత ఉంది. దీంతో ఏఐతో లభించే మెడికల్ సలహాలు, టీచింగ్ క్లాసులు అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగాల సంగతి ఏంటి? కనీసం వారానికి రెండు మూడు రోజులైనా పని చేయగలమా అని బిల్ గేట్స్ అన్నారు. అయితే కొన్ని రకాల సమస్యలను ఏఐ పరిష్కరించడమే కాకుండా కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయని, పనులు వేగంగా పూర్తవుతున్నాయని బిల్ గేట్స్ చెప్పారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఏఐ మరింత వేగంగా అందుబాటులోకి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆటోమేషన్ కు అడ్వాన్స్డ్ వెర్షన్. ఉన్నత స్థాయి మేధోపరంగాను అనేక పనులు చేస్తుంది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ డెవలపర్లు చేసే 70 శాతం పనులను ఏఐ చేయగలదు. టాలెంటెడ్ ఉద్యోగుల జీతభత్యాలపై ఏఐ ఎఫెక్ట్ పడుతుంది. ఏఐ వినియోగం పెరిగితే చాలా ఉద్యోగాలు గల్లంతే. వందేళ్లలో ఎన్నడూ చూడని పరిస్థితి రావచ్చు. ఉద్యోగం, కుటుంబ పోషణ వంటి సమస్యలు తలెత్తుతాయని ఒబామా పేర్కొన్నారు. అయితే బిల్ గేట్స్ ఒబామా అభిప్రాయాలపై సోషల్ మీడియాలో నెటిజెన్స్ తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇలాంటి భవిష్యత్తు అనేది మనం కోరుకునేది విద్య, ఆరోగ్య రంగాల్లో మనిషి ప్రతిభను మెషీన్లు భర్తీ చేయగలవా అని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అంశమని ఆందోళన చెందుతున్నారు.

పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్

అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని

పెళ్లి అనుకుంటున్నారా.. స్టంట్స్ షో అనుకుంటున్నారా..

నెల్లూరు జిల్లాలో అద్భుతం - శివలింగాన్ని చుట్టేసిన నాగుపాము

ఆ వ్యక్తికి నిలువెల్లా విషం.. అతని రక్తం నుంచే యాంటీ వీనమ్ తయారీ

యజమానిపై ప్రేమతో.. ఏనుగులు ఏం చేస్తున్నాయో చూడండి.. వీడియో

పులిని మింగబోయిన అనకొండ... ఆఖరికి అంతా షాక్ వీడియో
