AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోల్డ్ వద్దు.. సిల్వర్ ముద్దు.. బంగారం కంటే వెండే బెటర్ ఎందుకంటే?

గోల్డ్ వద్దు.. సిల్వర్ ముద్దు.. బంగారం కంటే వెండే బెటర్ ఎందుకంటే?

Samatha J

|

Updated on: Apr 27, 2025 | 5:17 PM

ఊహించిందే జరిగింది. పట్టపగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్న పసిడి ధర లక్ష దాటింది. రేటు కాస్త తగ్గుతుందేమోనని కొందామని ఆశగా ఎదురుచూసిన సామాన్యుడికి అందని ద్రాక్షగా మారింది. ప్రస్తుతం తులం బంగారం కొనా లంటే అక్షరా లా లక్ష చెల్లించాల్సిందే. అదే ఓ పది గ్రాముల నగ కొనా లంటే మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ కలుపుకొని ఇంకొంత ముట్టు చెప్పాల్సిందే. ఫ్యూచర్ లో గోల్డ్ రేట్ తగ్గే ఛాన్స్ ఉందా అంటే ఏ కోసాన ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇదే సమయంలో బంగారంతో పోటీ పడుతూ వెండి రేటు కూడా దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పసిడిలో పెట్టుబడి పెట్టేకన్నా వెండి కొనడం బెటర్ అంటున్నారు మార్కెట్ అనలిస్టులు. ఇంతకీ సిల్వర్ కొనమని వారు సలహా ఎందుకు ఇస్తున్నారు? వెండి బంగారాన్ని మించి రిటర్న్స్ ఇస్తుందా? భారతీయులకు బంగారం పట్ల మక్కువ ఎక్కువ. కానీ ఇప్పుడు ఆ ఇష్టాన్ని తగ్గించుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. పసిడికి మహిళలకు ఉన్న విడదీరాని బంధం పెరిగిన ధరలతో కాస్త బీటలు వారుతోందా? ఇండియాలో ఏ పండుగ అయినా శుభకార్యమైన బంగారం కొనడం ఆనవాయితీ.

ఇక పెళ్లిళ్ల సీజన్ లో అయితే చెప్పక్కర్లేదు. రేటు ఎంతున్నా గోల్డ్ షోరూంలో కస్టమర్లతో కిటకిటలాడుతుంది. మరోవైపు చాలామందికి బంగారం ఓ పెట్టుబడి సాధనం. అందుకే చేతిలో డబ్బుంటే చాలు దాన్ని గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనా లంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించక తప్పని పరిస్థితి నెలకొంది. డిమాండ్ పెరగడం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు గోల్డ్ రేటును ఆల్ టైం హైకి చేర్చాయి. బంగారం ధర ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 20% పెరిగింది. రేటు ఇంతలా పెరిగేందుకు చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. ఇదే ప్రధానంగా పసిడి పరుగులకు కారణమవుతోంది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. బంగారం వార్షిక డిమాండ్ లో దాదాపు 50% పెళ్లిళ్ల సీజన్ లోనే ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా. అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం తదితర పరిణామాలు బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. ట్రంప్ ప్రతీకార శుంకాల నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్లు ఎలా ఉంటాయో ఊహించలేని పరిస్థితి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు ముఖం చూపుతున్నారు. ఇది బంగారం డిమాండ్ ను మరింత పెంచుతోంది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భౌగోళిక రాజకీయ కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ పాలస్తీనా ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య యుద్ధం కూడా గోల్డ్ రేటును ఎఫెక్ట్ చేస్తున్నాయి.