శనిశ్వరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. శని అనుగ్రహంతో వీరికి జీవితంలో కొరతే ఉండదు.. మీరున్నారా చెక్ చేసుకోండి
జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాల్లో శని గ్రహం ఒకటి.. ఈ గ్రహానికి అధిపతి శనీశ్వరుడు. శనీశ్వరుడు కర్మ ఫలదాత. మనిషి చేసే కర్మల ఆధారంగా మంచి, చెడుల ఫలితాలను ఇస్తాడని.. న్యాయాదిపతి అని నమ్మకం. అయితే శనీశ్వరుడు అంటే మనుషులకు చాలా భయం. ఎందుకంటే జాతకంలో శనీశ్వరుడి స్థానం సరిగ్గా లేకపోతే అతను శని దోషం, ఎలి నాటి శని, అర్ధ శని ప్రభావాలబారిన పడి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుదని నమ్మకం. అయితే శని దేవుని అనుగ్రహం కలిగితే జీవితం రాజ యోగంతో సాగుతుందని తెలుసా.. శనీశ్వరుడి ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నా... ఆయనకు ఇష్టమైన రాశులు ఉన్నాయని తెలుసా..

శనిదేవుడు న్యాయ దేవుడు. హిందువులు కొలిచే దైవాల్లో ఒకరు శనీశ్వరుడు. సూర్యుడు, ఛాయల తనయుడు. నవగ్రహాలలో ముఖ్య స్థానం శనిశ్వరుడికి ఉంది. వారాల్లో శనివారం శనిశ్వరుడికి అంకితం చేయబడింది. భారీ సంఖ్యలో భక్తులు శనిశ్వరుడిని శనివారం పుజిస్తారు. శని దేవుడిని నిర్మల మైన హృదయంతో పూజించేవారికి ఆయన ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. దీనితో పాటు ఎలి నాటి శని, శని ధైయా పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో జ్యోతిషశాస్త్రం ప్రకారం శనిదేవుడికి చాలా ప్రియమైన మూడు రాశులు ఉన్నాయి. వీటిపై ఎల్లప్పుడూ శనీశ్వరుడి ఆశీర్వాదం ఉంటాయని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు ఈ రాశుల వారిపట్ల సంతోషంగా ఉంటాడు. వీరి కోరికలను తీరుస్తాడు. మరి ఈ రోజు శనిశ్వరుడికి ఇష్టమైన మూడు రాశులు ఏమిటో తెలుసుకుందాం. ఈ లిస్టు లో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.
శని దేవుడికి ఇష్టమైన రాశులు ఏమిటంటే
తుల రాశి: జ్యోతిషశాస్త్రం ప్రకారం శని దేవుడికి ఇష్టమైన రాశులలో ఒకటి తులారాశి. ఈ రాశి వారు శనిదేవుని ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు. తుల రాశి వారు బలమైన సంకల్ప శక్తిని , ఏకాగ్రత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. తులా రాశికి చెందిన వ్యక్తుల పట్ల శనీశ్వరుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడని నమ్ముతారు. ఈ రాశుల వారు జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రతి శనివారం శనీశ్వరుడిని పూజించడం శుభప్రదం అని నమ్మకం. ఇలా శనిశ్వరుడిని పూజిచడం వలన వీరి జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోయి.. శుభం కలుగుతుంది.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు జీవితాంతం శనీశ్వరుడి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారని నమ్ముతారు. ఈ రాశి వారిని శని దేవుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ దారిలో ఏర్పడే ఏవైనా సమస్యలను నివారించుకోగలుగుతారు. శనీశ్వరుడి దయ వల్ల ఈ వ్యక్తులు సంపదను పొందుతారు. ఆయన అనుగ్రహం వల్ల వీరు జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. వీరు ఎంచుకున్న వృత్తి, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. శనిదేవుని అనుగ్రహం వల్ల ఈ ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి.
మకర రాశి: మకర రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా శనీశ్వరుడికి ఇష్టమైన రాశి. వీరు కర్మఫలదాత ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు. ఈ రాశి వారు శని దేవుని అనుగ్రహం వల్ల వీరు చేసే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు ఆగిపోవడం అంటే జరగడదు. ఒకవేళ ఏదైనా కారణం వలన వీరి పనులు ఆగిపోయినా శనిశ్వరుడి పూజించడం వలన ఆగిన పనులన్నీ పూర్తవుతాయి. శని దేవుడి ఆశీర్వాదంతో వీరు జీవితంలో ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వ్యక్తులు శని దేవుడిని పూజించడం ద్వారా చాలా ప్రయోజనం పొందుతారు. అంతేకాదు వీరు ఎప్పుడూ డబ్బులకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








